డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ.



 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ. 

ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

వసతి గృహంలో సౌకర్యాలను గురించి విద్యార్థినిలను అడిగి తెలుసుకున్న శాసనసభ్యులు. అశోక్ రెడ్డి.

విద్యార్థినిలకు సౌకర్యాలు కల్పించటంలో నిర్లక్ష్యం తగదన్న అశోక్ రెడ్డి .

వసతీ గృహంలోని సమస్యలను మంత్రి డోలా దృష్టికి తీసుకెళ్లిన శాసనసభ్యులు.

 శాసనసభ్యులు అశోక్ రెడ్డి చొరవతో తక్షణమే స్పందించి రూ. 5 లక్షల రూపాయల  ఆర్ ఓ ప్లాంట్ మంజూరు చేసిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా.

ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గశాసనసభ్యులు

ముత్తుముల అశోక్ రెడ్డి రాచర్ల అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలను శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. 

వసతి గృహంలోని తరగతి గదులను పరిశీలించి అక్కడి విద్యార్థినిలతో శాసనసభ్యులు మాట్లాడి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 

వసతి గృహంలోని తరగతి గదుల్లో లైటింగ్, మరియు ఫ్యాన్లు పని చేయటంలేదని గమనించిన ఎమ్మెల్యే వెంటనే మరమ్మత్తులు నిర్వహించాలని ఆదేశించారు.

 అదే విధంగా విద్యార్థుల నివాస గదులను, మరియు మరుగుదొడ్లు, దోబీ లను పరిశీలించారు. 

 విద్యార్థినీలకు కు అందిస్తున్న భోజనం వసతి గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు వచ్చిన సమయంలో తీసుకొనే జాగ్రత్తలు, వైద్య పరీక్షలు వంటి అంశాలను, విద్యా బోధన పై ఆరా తీశారు.

 విద్యార్థినిలకు సౌకర్యాల కల్పనలో నిర్లక్ష్యం తగదని, విద్యార్థులు తమకు ఎటువంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకొని రావచ్చునన్నారు.

కూటమి ప్రభుత్వం విద్యావ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టిందని, నాణ్యమైన విద్యా, నాణ్యమైన ఆహారం, మౌళిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కటికే యోగానంద్, సొసైటీ బ్యాంక్ చైర్మన్ గోపిరెడ్డి జీవన్ రెడ్డి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోడి ఓబుల్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు.

Add


Post a Comment

Previous Post Next Post