కంభం లో చెకుముకి సైన్స్ సంబరాలు.

కంభం లో చెకుముకి సైన్స్ సంబరాలు.

 ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.

 ప్రకాశం జిల్లా కంభం : జన విజ్ఞాన వేదిక మండల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చెకుముకి సైన్స్ సంబరాలు గోడపత్రికను మండల విద్యాశాఖ అధికారి అబ్దుల్ సత్తార్ ఆవిష్కరించారు. 

అనంతరం అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే సైన్స్ పై అవగాహన పెంచుకోవాలని అన్నారు. 

విద్యార్థులలోని సృజనాత్మకతను వెలికి తీయడానికి ఇటువంటి పోటీ పరీక్షలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. 

జన విజ్ఞాన వేదిక కంభం మండల శాఖ అధ్యక్ష , కార్యదర్శులు వరికుంట్ల వెంకటేశ్వర్లు,నారపరెడ్డి రమణారెడ్డి మాట్లాడుతూ మండలంలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలోని 8, 9 మరియు 10వ తరగతి విద్యార్థిని, విద్యార్థులు అందరూ ఈనెల 18వ తేదీన జరిగే పాఠశాల స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలలో పాల్గొనే విధంగా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు , పాఠశాల యాజమాన్యాలు మరియు తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు.

 నవంబర్ 1 వ తేదీన మండల స్థాయి ,23 న జిల్లాస్థాయి, డిసెంబర్ 12 ,13 మరియు 14 తేదీలలో రాష్ట్రస్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు జరుగుతాయనీ, ఈ చెకుముకి సైన్స్ సంబరాలను అందరూ జయప్రదం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో చెకుముకి కన్వీనర్ షేక్ నాయబ్ రసూల్, కోశాధికారి మస్తాన్, ఉపాధ్యక్షులు అరుణ్ కుమార్, యూత్ కన్వీనర్ జావిద్, మరియు పాఠశాల సిబ్బంది నూర్జహాన్ బేగం,శరబమ్మ , విజయలక్ష్మి ,సత్య రామారావు , సుబ్రహ్మణ్యం ,సలీం భాష , రమణారెడ్డి , శ్రీకృష్ణ ,రంగనాయకులు , విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Add



 

Post a Comment

Previous Post Next Post