శ్రీ గంగానమ్మ, శ్రీ ఆది మహాలక్ష్మమ్మ, శ్రీ వినుకొండ అంకమ్మ పోతురాజు బాబు గార్ల జాతర మహోత్సవ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం.
అక్టోబర్ 08:- పార్టీలకు అతీతంగా, వివాదాలకు తావులేకుండా ఏలూరు పవర్‌పేటలో వేంచేసియున్న శ్రీ గంగానమ్మ, శ్రీ ఆదిమహాలక్ష్మమ్మ, శ్రీవినుకొండ అంకమ్మ, పోతురాజుబాబుల జాతర మహోత్సవాన్ని విజయవంతం చేయాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సూచించారు. ఏలూరు పవర్‌పేటలోని ఎఎంసి చైర్మన్ మామిళ్ళపల్లి పార్ధసారధి స్వగృహంలో బుధవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో పవర్‌పేట శ్రీ గంగానమ్మ, శ్రీ ఆదిమహాలక్ష్మమ్మ, శ్రీ వినుకొండ అంకమ్మ, పోతురాజుబాబుల జాతర మహోత్సవం బ్రోచర్‌ను ఆర్టీసి విజయవాడ జోన్ ఛైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఎఎంసి చైర్మన్, జాతర కొలుపుల కమిటీ అధ్యక్షులు మామిళ్ళపల్లి పార్థసారధి, ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, స్థానిక ప్రముఖులు దొంతంశెట్టి విశ్వేశ్వరరావు తదితరులతో కలిసి ఎమ్మెల్యే, జాతర కొలుపుల కమిటీ గౌరవాధ్యక్షులు బడేటి చంటి ఆవిష్కరించారు. జాతర మహోత్సవంలో భాగంగా నవంబర్ 9వ తేదీన అమ్మవార్లకు ముడుపు కట్టి, పందిరి రాట స్థాపనకు శ్రీకారం చుడతారు. నవంబర్ 26న అమ్మవార్లకు స్నానమును ఆచరించి, ఘట ఆవాహన గావించి 4 పగళ్ళు, 3రాత్రులు నగర సంచారానికి శ్రీకారం చుడతారు. నవంబర్ 29న అమ్మవార్లను మేడల్లో ప్రవేశపెట్టుట, 30న అమ్మవార్ల ప్రధమ నగర సంచారం ప్రారంభిస్తారు. డిసెంబర్ 14న శ్రీ వినుకొండ అంకమ్మ అమ్మవారిని రంగరంగ వైభవంగా ఊరేగించి మేడల్లోనికి ప్రవేశింపచేస్తారు. వచ్చే జనవరి 24న కొర్లబండిలో ఊరేగించి మేడల వద్దకు తీసుకువస్తారు. జనవరి 25న అమ్మవార్లకు కుంభం పోయుట ప్రారంభిస్తారు. 26వ తేదీన అమ్మవార్లను భారీ ఊరేగింపు నడుమ సాగనంపాలని జాతర కొలుపుల కమిటీ నిర్ణయించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఏలూరు నగరంలో ఎంతో చరిత్ర కలిగిన పవర్‌పేట అమ్మవార్ల జాతరలో తనకు కూడా అధికారిక హోదాలో పాల్గొనే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ జాతర మహోత్సవాన్ని పార్టీలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా నిర్వహించాలని సూచించిన ఎమ్మెల్యే,,, ఇందులో ఎటువంటి వివాదాలకు ఆస్కారం లేకుండా చూడాల్సిన బాధ్యతను కమిటీ సభ్యులు సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఆ ఆలోచనతోనే కమిటీలో స్థానిక ప్రముఖులకు అగ్రపీఠం వేసినట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కార్యక్రమంలో కో - ఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, ఎస్సెమ్మార్ పెదబాబు, కొలుపుల కమిటీ గౌరవ అధ్యక్షులు బడేటి వెంకటరామయ్య, బంకా ప్రసాద్, కార్యదర్శి కేశవరావు, వీరాస్వామి, కోశాధికారి జవ్వాజి మోహన్ విఠల్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కందుకూరి రవికుమార్ శర్మ, నవుడూరి వాసు కమిటీ సభ్యులు అలజంగి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Add


