జిల్లా కలెక్టర్ అదేశాలు బేఖాతరు.


 జిల్లా కలెక్టర్ అదేశాలు బేఖాతరు.

క్రైమ్ 9 మీడియా ప్రతినిధి- పి. మహేశ్వరరావు.

జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ (క్రైమ్).

అనకాపల్లి అక్టోబర్:08

మాడుగుల :వి.మాడుగుల-- వమ్మలి,జగన్నాదపురం క్రీష్ణాపురం,మరియు,రావికమతం మండలం కొమిరి గ్రామాల్లో 6 వ విడత భూపంపిణీలో ఉరలోవ కొండకు చుట్టు 450 మందికి పట్టాలు ఇచ్చిన భూములకు సర్వే నెంబర్లు సరి చేయడం కోసం గ్రామసభలు జరిపి వెంటనే వెబ్ లెండ్ లో నమోదు చేయాలని గత నెల 27 వ తేదిన జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను నర్సీపట్నం ఆర్ డి ఓ మాడుగుల తహశీల్దార్ ప్రక్కన పెట్టె సారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న మండల కార్యదర్శి ఇరట నరసింహమూర్తి కె భవానీ పేర్కొన్నారు బుధవారం మాడుగులలో ఓప్రకటన విడుదల చేసారు అనంతరం మాట్లాడారు 2016 - 2017లో 6 వ విడత భూపంపిణీలో ఉరవ కొండ చుట్టు వందలాది మంది పెదలకు గిరిజనులకు ధళితు లకు నాటి ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసిందని తెలిపారు పట్టాలు ఇచ్చిన సర్వే నెంబర్లు గల ఏ భూములు వెబ్ ల్యాండ్ లో నమోదు అవ్వ లేదన్నారు, పట్టాలు ఇచ్చిన సర్వే నెంబర్లు కు పెదలు సాగులో ఉన్న సర్వే నెంబర్లు గల భూములకు సంభంధం లెదని తెలిపారు దీని వలన పట్టాదార్లు అందరు తీవ్ర ఆందోళన చేందుతున్నారని తెలిపారు,రెవెన్యూ అధికారులు చేసిన తప్పిదాలు వలన పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దీంతో పాటు ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు,స్కీములు అమలు కావడం లేదన్నారు. 2016 వ సంవత్సరం నుండి అనేక పర్యాయాలు వి మాడుగులం తహశీల్దార్ కు జిల్లా కలెక్టర్ కు గ్రామాల్లో జరిగిన రైవెన్యూ సదస్సుల లోను అనేక సార్లు ధరఖాస్తులు పెట్టుకు న్నారని తెలిపారు, దీంతో జిల్లా కలెక్టర్ అమరావతి సిసిఎల్ కు.సమస్య పరిష్కారం కోసం వ్రాయడం జరిందన్నారు ఆగస్టు 11న సిపిఎం నాయకులు తో పాటు ఈగ్రామాలకు చేందిన పేదలు విజయవాడలో సి సి ఎల్ ఎ కలిసి వినతిపత్రం ఇచ్చి సమస్యను వివరించడం తో పాటు 26 తేదీన వమ్మలి లో అంబేద్కర్ విగ్రహం వద్ద ఉరితాళ్ళుతో నిర్సన తెలపడం జరిగిందన్నారు దీంతో కలెక్టర్ స్పందించి వెంటనే గ్రామసభ జరిపి లబ్ధిదారులను గురించి పట్టాలు లెని వారికి పట్టాలుతో పాటు గతంలో పట్టాలు ఇచ్చిన వారి అందరికీ వెబ్ లెండ్ లో సరి చేయాలని అదేశాలు ఇచ్చారని తెలిపారు అయినప్పటికీ రెవెన్యూ అదికారులు రాజకీయ వత్తిళ్ళు తలవగ్గి జిల్లా కలెక్టర్ ఆదేశాలను తుంగలోకి తోక్కి పెట్టె సారని అగ్రహారం వ్యక్తం చేశారు ఇప్పటికైనా వెంటనే గ్రామసభ జరిపి సర్వే నెంబర్లు సరి చేసి వెబ్ లెండ్ లో వెంటనే నమోదు చేయాలని ఇప్పటికె సాగులో ఉండి పట్టారు ఇవ్వని వారి అందరికీ పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేసారు ఇప్పటికే పట్టాలు ఇచ్చిన పేదలు అందరు ఈ భూములు తప్ప మరి ఏ ఇతర భూములు లేవని తెలిపారు ఈభూముల పై అదార పడ్డ పేదలు అందరు ఇప్పటికే గత నాలబై సంవత్సరాలుగ సాగులో ఉన్నారని తెలిపారు ఈభూముల్లో జీడీ మామిడి ఇతర పంటలు పండించు కుంటు జీవ నోపాధి పోందుతున్నారని తెలిపారు,ఇప్పటికే రెవెన్యూ అదికారులు నిర్లక్ష్యంతో గిరిజనులు ధళితులు పేదలు అన్నివిధాలుగా నష్ట పోవడం జరిగిందని ఇప్పటికైనా వెంటనే గ్రామసభలు జరిపి జిల్లా కలెక్టర్ ఆదేశాలను వెంటనే అమలు చేయాలని లెదంటే తహశీల్దార్ కార్యాలయం ఎదుట లబ్దిదారులతో కలిసి ఉరితాళ్ళుతో మరోసారి అందోన చేస్తామని వారు స్పష్టం చేశారు.

Add



Post a Comment

Previous Post Next Post