వర్గీకరణ వెనక్కు తీసుకునే వరకు మాలల పోరాటం ఆగదు. వర్గీకరణ అంతం మాలల పంతం.

వర్గీకరణ వెనక్కు తీసుకునే వరకు మాలల పోరాటం ఆగదు. వర్గీకరణ అంతం మాలల పంతం. 

ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు

 ఈరోజు ప్రకాశం జిల్లా మార్కాపురంలో ప్రెస్ క్లబ్ లో జరిగినటువంటి మాల సంఘాలు మాల ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశంలో రాష్ట్ర మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు తుల్లిబిల్లి అశోక్ బాబు మాట్లాడుతూ... దళితుల మీద దాడి జరిగితే ఏ ఒక్కరు కూడా స్పందించి వచ్చి పరామర్శించినటువంటి పరిస్థితి లేదు, ఇంకా దళితులు చంపితే ప్రభుత్వమే డబ్బులు ఇచ్చి ప్రోత్సహించడం దుర్మార్గం 2. దళితుల ఐక్యత దెబ్బతీసే వర్గీకరణ బిల్లుని గవర్నర్ చేత ఆమోదింపజేసి తగాదాలు పెట్టి తమాషాలు చూసేటువంటి చర్యల్ని ఖండిస్తున్నాం 3. ఎస్సీ జనాభా 20 శాతం రిజర్వేషన్ శాతం పెంచాలి 4. ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ అమలు చేయాలి 4. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ అమలు చేయాలి 5. వర్గీకరణ ద్వారా మాలలు తీవ్రంగా నష్టపోతున్నారు 6. నవంబర్ 8వ తేదీన రాష్ట్రంలో అన్ని జిల్లాల మాల సంఘాల నాయకులతో భవిష్యత్తు కార్యాచరణ మీద సమావేశం జరుగుతుందని.ఈ కార్యక్రమంలో బహుజన సైన్యం వ్యవస్థాపక అధ్యక్షులు నాగయ్య మాట్లాడుతూ వర్గీకరణ వెనక్కి తీసుకునే వరకు మాలలలో ఉద్యమం ఆపమని తెలిపారు. మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కలవకూరి అబ్రహం, మంచా సాయి, మాల మహానాడు యువ నాయకులు,గొట్టిముక్కల యోహాన్, దళిత నాయకుడు మాలపోలు శాంతకుమార్, దాసరి సునీల్ కుమార్, దార్ల సురేష్ బాబు, జనుమాల సురేష్ బాబు,దమ్ము బాబి,తదితరులు పాల్గొన్నారు.

Add



 

Post a Comment

Previous Post Next Post