గిద్దలూరు పట్టణంలో ఎమ్మెల్యే ముత్తుముల ఆధ్వర్యంలో భారీ ఆటో ర్యాలీ.


 


 గిద్దలూరు పట్టణంలో ఎమ్మెల్యే ముత్తుముల ఆధ్వర్యంలో భారీ ఆటో ర్యాలీ.

ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు.

ఆటోడ్రైవర్ల సేవలో డబుల్ ఇంజన్ సర్కారు,

ఆటో సోదరులకు అండగా కూటమి ప్రభుత్వం

ప్రతీ ఆటో డ్రైవర్ సోదరునికి యేటా రూ. 15,000-00 లు

గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల.

ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటాం” అని గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి తెలిపారు. 

 ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో జరిగిన “ఆటోడ్రైవర్ల సేవలో” పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని డ్రైవర్ సోదరులతో కలిసి స్వయంగా ఆటో నడిపి అందరిని అబ్బుర పరిచారు.

 పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ నుండి, కుమ్మరాంకట్ట, రైల్వే స్టేషన్ రోడ్, అన్న క్యాంటీన్, రాచర్ల గేట్ సెంటర్ ల నుండి మార్కెట్ యార్డ్ వరకు భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు.

ర్యాలీ అనంతరం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ గత ఐదేళ్ల అరాచక పాలనలో ఆటోడ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఇప్పుడు ప్రజా ప్రభుత్వం వారి రుణభారం తగ్గించే దిశగా ‘ఆటోడ్రైవర్ల సేవలో’ పథకాన్ని ప్రవేశపెట్టిందని , రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గార్ల నాయకత్వంలో అద్భుతంగా పనిచేస్తోందని, దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని 3 లక్షల మంది ఆటో డ్రైవర్లకు రూ.436 కోట్లు విడుదల చేసి, ఒక్కో డ్రైవర్‌కి రూ.15,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తున్నామని తెలిపారు. ఇచ్చిన మాట కట్టుబడి ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 15 వేల రూపాయలు వారి ఖాతాలో ఈరోజు జమ చేస్తున్నామని అన్నారు. 

గత వైసిపి పాలకులు రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి వేశారని అన్నారు. ఇచ్చిన మాట కట్టుబడి.సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నామని సంవత్సరానికి ప్రతి కుటుంబానికి మూడు ఉచిత సిలిండర్లను అందిస్తున్నామని, పెన్షన్ 3000 రూపాయలు నుండి 4000 రూపాయలకు ఒకేసారి పెంచిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదని అన్నారు. ఐదు రూపాయలకే అన్న క్యాంటీన్లో నాణ్యమైన అల్పాహారం మరియు భోజనం అందిస్తున్నామని అన్నారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా సంవత్సరానికి ప్రతి రైతుకి 20 వేల రూపాయలు అందిస్తున్నామని తెలియజేశారు. నిరుద్యోగులకు ఇప్పటికే డీఎస్సీ ద్వారా 15,535 టీచర్ పోస్టులు భర్తీ చేశామని గుర్తు చేశారు. ఇక ప్రైవేట్ సెక్టార్ లో ఇప్పటికే నాలుగు లక్షల 75 వేల ఉద్యోగాలు ఇచ్చామని ఈ ఐదు సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి సంవత్సరానికి తల్లికి వందనం ద్వారా 13వేల రూపాయలు అందించామని, స్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించుటకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించామని అన్నారు. ఇక ఇప్పుడు ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 15 వేల రూపాయలు వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. అదే విధంగా నూతన జీఎస్టీ విధానం వలన నూతన ఆటో పై 30వేల వరకు ఆదా అవుతుందన్నారు.. అదే విధంగా గ్రీన్ టాక్స్ ను రద్దు చేశామన్నారు.. మన గిద్దలూరు నియోజకవర్గంలో 1211 మంది ఆటో డ్రైవర్లకు రూ. 1,81,65000-00 లు, అక్షరాల కోటి ఎనబై ఒక లక్ష అరవై ఐదు వేల రూపాయలు అకౌంట్లో జమ చేస్తున్నామని వీరిలో అధిక భాగం బీసీలు, ఎస్సీలు ఉన్నారని అన్నారు. ప్రజా సంక్షేమమే ద్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందని దీనికోసం మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్, యువ నాయకులు నారా లోకేష్ బాబు,సంక్షేమం, అభివృద్ధి మేళవించి కష్టపడి నిరంతరం పనిచేస్తున్నారని ప్రజల బాగోగుల కోసం తపిస్తున్నారని అన్నారు. అనంతరం ఆటో డ్రైవర్లకు రూ. 1,81,65000-00 లు, రూపాయల చెక్కును అందజేశారు.

ఈ కార్యక్రమంలో గిద్దలూరు మున్సిపాలిటీ చైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య, జడ్పీటీసీ బుడతా మధుసూదన్, సొసైటీ బ్యాంక్ చైర్మన్ దుత్తా బాల ఈశ్వరయ్య, రాష్ట్ర గ్రీనింగ్ & బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కటికే యోగానంద్, ఎడ్యుకేషన్ & వెల్ఫేర్ డైరెక్టర్ గోనా చెన్నకేశవులు, గిద్దలూరు పట్టణ అధ్యక్షులు సయ్యద్ శానేశా వలి, మండల అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి, ఒంగోలు జిల్లా జనసేన నాయకులు, లంకా నరసింహారావు, బీజేపీ నాయకులు పిడతల రమేష్ రెడ్డి, సొసైటీ బ్యాంక్ చైర్మన్లు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు, పట్టణ కౌన్సిలర్లు, కో ఆప్షన్ మెంబర్లు, నాయకులు, డిప్యూటీ కలెక్టర్ ఎం. వేంకట శివరామిరెడ్డి, మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ మాధవరావు, మున్సిపల్ కమిషనర్ ఈవి రమణబాబు, తహసీల్దార్ ఆంజనేయరెడ్డి, మరియు మండల అధికారులు, కూటమి నాయకులు మరియు ఆటో కార్మికులు. తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post