మద్యం పై దశల వారీగా ఉద్యమం సిపిఎం.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి, జిల్లా ఇంచార్జి (క్రైమ్),
పి. మహేశ్వరరావు.
అనకాపల్లి అక్టోబర్:05
దేవరాపల్లి, మద్యం బెల్టుషాపుల పై దశలవారీగా ఉద్యమం చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న మండల కార్యదర్శి బిటి దోర పేర్కొన్నారు ఆదివారం స్థానిక సిఐటియు కార్యాలయంలో సిపిఎం విస్తృత స్థాయి సమావేశం యం,ఎర్రు నాయుడు అద్యక్షతన జరిగింది అనంతరం వారు మాట్లాడారు ప్రభుత్వ నిబంధన లకు విరుద్ధంగా మద్యం వ్యాపారులు బరి తెగింపుకు పూను కుంటున్నారని తెలిపారు మండలంలోని ప్రతి గ్రామాలోను విచ్చలవిడిగా మద్యం బెల్ట్ షాపులు నిర్వహణ చేస్తు పేదలు కష్టాన్ని దోసు కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు,ప్రభుత్వ కేటాయించిన లైసెన్స్ షాపులకు,అనుబంధంగా గ్రామాల్లో మద్యం దుకాల యజమానులు చిన్న చిన్న గ్రామాల్లోను కిల్లి కోట్టులోను పాన్ షాపులు దాబాల్లోను టి కోట్టుల్లో సైతం విచ్చలవిడిగా మద్యం బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని ఇది అత్యంత దుర్మార్గ మన్నారు చిన్న పిల్లలు మహిళలు నిత్యం తిరుతున్న రోడ్లు పక్కన బెల్ట్ షాపులు నిర్వహించడం చట్టాన్ని విశ్మరించడ మేనని తెలిపారు గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహించడం వల్ల ప్రభుత్వం కేటాయించిన యం ఆర్పి ధరల కంటే బెల్ట్ షాపులో ఒక బాటిల్ దగ్గర అదనంగా 50 నుండి 100 రూపాయలు అదనంగా వసూళ్లు చేస్తున్నారని తెలిపారు.గ్రామాల్లో మద్యం విక్రయించ డానికి అనధికారిక వేలం పాటలు లక్షల్లో నిర్వహించి బెల్టు షాపులు యజమానులు సొమ్ము చేసు కుంటున్నారని తెలిపారు అక్రమ అమ్మ కాలు జరగడంతో సామాన్యులు నిరు పేదలు కూలీలు జేబులు ఖాళీ అవు తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామాల్లో దర్జాగా మద్యం విక్రయాలు నిర్వహించడం వల్ల మద్యం పట్ల ఎక్కువ శాతం యువత మద్యానికి బానిసలు అవుతున్నారని తెలిపారు నిభందనులు ప్రకారం గ్రామానికి కనీసం 200 మీటర్లు దూరంలో మద్యం షాపులు పెట్టాలని కాని ఇది ఎక్కడ అమలు కావడం లెదన్నారు బడి గుడి ఆర్ టి సి కాంప్లెక్స్ వంటి ప్రదేశాల్లో పెట్ట రాదని తెలిపారు గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ మద్యం షాపులు నిర్వహించినప్పుడు కనీసం కీలోమీటారు దూరంలో షాపులు నిర్వాహన జరిగేదని ప్రస్తుతం నిబంధనలకు పాతర వేసారని,తెలిపారు గ్రామాల్లో అయితే,తెల్లవారుజాము నుంచే మద్యం బెల్ట్ షాపులు తెరిసి ఉంచుతున్నారని తెలిపారు, బెల్ట్ షాపులు వద్ద పదుల సంఖ్యలో మందు బాబులు బార్లు తీరుతున్నారని అన్నారు.ఎంతో మంది పేద కుటుంబాలు వీటి ప్రభావంతో రోడ్డున పడు తున్నారని తెలిపారు మరి కొన్ని గ్రామాల్లో మద్యం వ్యాపారం వలన మహిళలు మైనర్ బాలికలపై హత్యచారాలు పెరిగి పోతున్నాయని దీన్ని నివారించ వలసిన ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకొకుండా నిమ్మకు నీరుత్తెనట్లు వ్యహరిస్తున్నారని విమర్శించారు ఇప్పటికైనా అక్రమ బెల్టు షాపులపై చర్యలు తీవాలని లైసెన్సులు లేని దాబాల్లో మద్యం అమ్మకాలుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు లేదంటే దశలవారీగా పెద్ద ఎత్తున అందోన చేస్తామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో బి నాగేశ్వరరావు డి,శంకర్ సిహెచ్ దేముడు జె ఈశ్వరరావు వి దోంగబాబుతో పాటు పార్టీ శ్రేణులు పాల్గోన్నవారు.
