సింగరాయకొండ తాసిల్దార్ కార్యాలయం సందర్శించిన కలెక్టర్.


 సింగరాయకొండ తాసిల్దార్ కార్యాలయం సందర్శించిన కలెక్టర్.

ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

 ప్రకాశం జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ శ్రీ పి. రాజాబాబు, అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు సింగరాయకొండ తహసిల్దార్ కార్యాలయంను సందర్శించి భారీ వర్షాల నేపథ్యంలో చేపడుతున్న ముందస్తు జాగ్రత్తలు, చర్యలు పై సమీక్షించి మండల అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

ఈ సమావేశంలో ఒంగోలు ఆర్డీఓ శ్రీమతి కళావతి, జిల్లా పరిషత్ సిఈఓ చిరంజీవి, డిఆర్డిఏ పిడి నారాయణ, డీపీఓ వెంకటేశ్వర రావు, మత్స్య శాఖ జేడి శ్రీనివాస రావు, ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్ఈ బాల శంకర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా వెంకటేశ్వర రావు, తహసిల్దార్ రాజేష్, ఎంపిడిఓ శ్రీమతి జయమణి తదితరులు పాల్గొన్నారు.

Add 


Post a Comment

Previous Post Next Post