టీజీపీఎస్సీ తప్పిదాలతో గందరగోళంలో నిరుద్యోగులు,
గ్రూప్ 1 పరీక్ష తప్పిదాలపై రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి.
ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి డిమాండ్.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) చేస్తున్న వరుస తప్పిదాలతో నిరుద్యోగ యువత గందరగోళంలో పడిందని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) తెలంగాణ రాష్ట్ర సమితి విమర్శించింది.
ఈ సందర్భంగా,ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, కార్యదర్శి వలి ఉల్లా ఖాద్రీ, కల్లూరు ధర్మేంద్ర* లు మాట్లాడుతూ ఇప్పటికే గ్రూప్-1 అభ్యర్థులు పరీక్షను మూడుసార్లు రాశారని గుర్తు చేశారు.
గ్రూప్-1 మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనంలో తప్పిదాలు జరిగాయంటూ కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారని, మళ్లీ మూల్యాంకనం చేయాలనీ, లేదంటే మళ్లీ పరీక్షను నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం గత తప్పిదాలను పునరావృతం కాకుండా యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో పరీక్షలను నిర్వహించి నియామకాలను చేపడతామని ప్రకటించిందని పేర్కొన్నారు.
కానీ టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసిన తర్వాత కూడా మళ్ళీ తప్పిదాలు చేయడంతో నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అభ్యర్థులకు న్యాయం చేసే విధంగా తప్పిదాలకు తావులేకుండా టీజీపీఎస్సీని తీర్చిదిద్దాలని కోరారు.
పారదర్శకంగా నియామకాలు చేపట్టేలా కోర్టు కేసులు రాకుండా గ్రూప్-1 నియామకాలను చేపట్టాలని డిమాండ్ చేశారు.లేదంటే నిరుద్యోగ అభ్యర్థులను సమీకరించి రాష్ట్ర వ్యాప్తము ఉద్యమాలకు పిలుపునిస్తామని వారు హెచ్చరించారు.
.jpeg)
