ఏలూరులో అఖండ అన్నసమారాధన.
* అన్నం పరబ్రహ్మ స్వరూపం - ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు.
ఏలూరు, ఆగస్టు 31:- ఏలూరులో పలు డివిజన్ లో వినాయక చవితి వేడుకలను భక్తి శ్రద్ధలతో ఆయా కమిటీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. వినాయక చవితి మహోత్సవాల్లో భాగంగా ఆదివారం 13 వ డివిజన్ వైఎస్సార్ కాలనీ లో, మరడాని రంగారావు కాలనీలో, 3 వ డివిజన్ నవాబు పేట, 5 వ డివిజన్ నాగేంద్ర కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. తొలుత ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ సందర్భంగా గత 15 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున వినాయక ఉత్సవాలను నిర్వహిస్తూ వేలాది మందితో అఖండ అన్న సమారాధన నిర్వహిస్తున్న గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులను అభినందించారు. సర్వవిజ్ఞాలను తొలగించే లోక పూజితుడైన ఆ గణనాథుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, సమిష్టిగా ఈ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించి అన్నసమారాధన పెద్ద ఎత్తున నిర్వహించడం అభినందనీయమన్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. అన్నదానం ఇతర దానాల కంటే గొప్పదిగా భావిస్తారని అన్నదానం పొందిన వారి ఆశీస్సులు దాతలకు సానుకూలతను తెస్తాయని, అన్నదాన కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్న అన్నదాన కమిటీ సభ్యులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో 13 వ డివిజన్ వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు దుర్గా బీబీ, పి.నాగేశ్వర రావు, కొనకళ్ళ నాగరాజు, కొనకళ్ళ శంకర్, టి. లక్ష్మణ్ సింగ్,3 వ డివిజన్ నవాబు పేట వినాయక కమిటీ సభ్యులు, 4 వ డివిజన్ నాగేంద్ర కాలనీ శ్రీ లక్ష్మీ గణపతి వినాయక కమిటీ సభ్యులు, పలువురు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, సంఘ సేవకులు, భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


.jpeg)


