ఏలూరు నగరాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేయడమే తన ఏకైక లక్ష్యo.--ఎమ్మెల్యే బడేటి చంటి .



ఏలూరు నగరాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేయడమే తన ఏకైక లక్ష్యo.--ఎమ్మెల్యే బడేటి చంటి .

ఏలూరు నగరాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేయడమే తన ఏకైక లక్ష్యమనీ ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి చెప్పారు. ఏలూరు 12వ డివిజన్‌లోని వెంకన్న చెరువు స్మశాన వాటికలో శ్రీ వాసుపూజ్య పార్శ్వనాధ్‌ జైన్‌ సేవాసంఘం సౌజన్యంతో పునర్నిర్మించిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే చంటి బుధవారం ప్రారంభిం-చారు. ఇక్కడకు వచ్చేవారి సౌకర్యార్థం బోరును ఏర్పాటు చేయడంతో పాటూ, షెడ్డు పునర్నిర్మాణ పనులను పూర్తిచేయగా,,, వాటిని ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ ప్రభుత్వంతో పాటూ దాతలు కూడా అభివృద్ధిలో భాగస్వాములైనప్పుడే అన్నింటా సమానాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకుని అవసరమైన ప్రాంతాల్లో అభివృద్ధి ప్రణాళికలను విస్తరించేందుకు తాను దాతలను కలుస్తూ వస్తున్నానన్నారు. ఈక్రమంలో వెంకన్న చెరువు స్మశాన వాటికలో బోరు ఏర్పాటుతో పాటూ, షెడ్డు నిర్మాణ పనులకు ముందుకొచ్చిన జైన్‌ సంఘం నేతలను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, 12వ డివిజన్‌ కార్పొరేటర్‌ కర్రి శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ కరణం గణేష్, మాజీ కార్పొరేటర్ అద్దేపల్లి శ్రీనివాస్ రావు, డివిజన్ నాయకులు షేక్ జావిద్ కూని శెట్టి మురళీకృష్ణ జైన్ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు..













Post a Comment

Previous Post Next Post