మన భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా
జై జవాన్ సేవా ఫౌండేషన్. మరియు దివ్య హెల్పింగ్ ఆధ్వర్యంలో వికలాంగునికి సైకిల్ అందచేత.
( ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు)
ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని కొమరోలు మండలం రాజుపాలేం వెంకటాపురం గ్రామానికి చెందిన. పెద్ద కాశిరావు వయస్సు 30 సంవత్సరాలు పుట్టుకతోనే వికలాంగుడు గత కాలంలో మన ఫౌండేషన్ ను ఆశ్రయించడం జరిగింది.
ఇతని పరిస్థితిని తెలుసుకున్న మన ఫౌండేషన్ జవాన్లు సహాయం చేయటానికి ముందుకు రావటంతో ఇతనికి మన జై జవాన్ ఫౌండేషన్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఆధ్వర్యంలో మన గ్రూప్ జవాన్ల సహకారంతో ఈరోజు ట్రై సైకిల్ అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ప్రకాశo జిల్లా మాజీ సైనికుల అధ్యక్షుడు అంకన్న మానసిక వికలాంగుల హాస్టల్ గోపాల్ రెడ్డి దివ్య హెల్పింగ్ హాండ్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు లోక్కు శరత్ బాబు.రంగస్వామి. అలాగే గ్రామ ప్రజలు పాల్గొని జై జవాన్ ఫౌండేషన్ జవాన్లకు మరియు జిల్లా సైనికులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
