స్వస్తి నారి సశక్తు పరివార్ అభియాన్ ఆరోగ్య శిబిరం.
మోక్షగుండం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య
శిబిరం.
(క్రైమ్ 9 మీడియా బేస్తవారిపేట రిపోర్టర్ )
ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలంలోని మోక్షగుండం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో కంభం ప్రభుత్వ వైద్యశాల డాక్టర్ విజయ్. మోక్షగుండం హోమియో వైద్యశాల డాక్టర్ గిరి. మోక్షగుండం వైద్యశాల డాక్టర్ వికాస్. డాక్టర్ రజిత భానులు పాల్గొని
రోగులకు వైద్య సేవలను అందించారు ఈ శిబిరంలో ఎముకలు కీళ్ల నొప్పులకు. మరియు వివిధ రకాలైన జబ్బులకు చికిత్సలను అందజేశారు ఈ ఆరోగ్య శిబిరానికి 273 మంది రోగులు హాజరైనట్టు డాక్టర్ వికాస్ తెలిపారు.

