జిల్లా అవార్డు అందుకున్న చిన్నకంభం ఉపాధ్యాయుడు.
( ప్రకాశం జిల్లా క్రైమ్ 9 ప్రతినిధి దాసరి యోబు )
ప్రకాశం జిల్లా కంభం మండలంలోని చిన్నకంభం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న బూదాల.సురేష్ బాబు నాజీర్ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్ అందుకున్నారు.
శుక్రవారం ప్రకాశం జిల్లా కలెక్టరేట్ లోని స్పందన సమావేశపు హాల్లొ నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ, ఎమ్మెల్యే బిఎన్.విజయకుమార్, డిఆర్వో&మేయర్ సుజాత,డిఈవో కిరణ్ కుమార్ చేతులమీదుగా ఆయన జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు.
ఈ సందర్భంగా గ్రామస్థులు,మండలంలోని పలువురు ఉపాధ్యాయులు, ఎంఈవోలు,సిఆర్పిలు ఆయన విద్యా సేవలను ప్రశంసిస్తూ అభినందనలు తెలియజేశారు.
