విజ్ఞాన శిల్పాల తయారిలో విశ్రాంత దివ్యాంగుల ఉపాధ్యాయులు కృషి అభినందనీయం.
లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్ ) పల్నాడు జిల్లా అధ్యక్షులు, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఇరువురు విశ్రాంత దివ్యాంగుల ఉపాధ్యాయులను సన్మానించారు *★
ఎంతో మంది విజ్ఞాన శిల్పాలను తయారు చేయండం తోపాటు వారు ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు విశ్రాంత దివ్యాంగుల ఉపాధ్యాయులైన యనమాల ప్రభాకరావు, షేక్. మహబూబ్ తమ వంతుగా కృషి చేశారని
లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్ )పల్నాడు జిల్లా అధ్యక్షులు, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్ పేర్కొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం పార్టీ ఆధ్వర్యంలో సత్తెనపల్లి లో ఇరువురు విశ్రాంత దివ్యాంగుల ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పుట్టుకతో అంగవైకల్యం ఉన్నప్పటికీ వాటిని అధికమించి ఉపాధ్యాయ వృత్తి లో ఎంతోమందిని విజ్ఞాన శిల్పాలుగా తయారు చేశారని కొనియాడారు. విశ్రాంత ఉపాధ్యాయులు కేబీఆర్జే ప్రసాద్, రంగారెడ్డి, జెపిఎస్. శాస్త్రిలు ప్రసంగించారు. అనంతరం ఇరువురు దివ్యాంగుల ఉపాధ్యాయులను పలువురు ఘనంగా సన్మానించి డాక్టర్.బి.ఆర్.అంబేడ్కర్ జీవిత చరిత్ర పుస్తకాలను అందజేశారు. కార్యక్రమం లో నాయకులు కారుమంచి గంగరాజు, కొరబండి ఆంథోనీ, రాబర్ట్, షేక్. సుభాని, కరిముల్లా, సరికొండ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
