వైసీపీ కార్యకర్త గాలి బ్రహ్మయ్య మృతికి నివాళులర్పించిన బుచేపల్లి, కుందూర్.
( ప్రకాశం జిల్లా క్రైమ్ 9 ప్రతినిధి దాసరియోబు )
ప్రకాశం జిల్లా కంభం మండలం దర్గా గ్రామ వాసి వైసీపీ కార్యకర్త గాలి బ్రహ్మయ్య గురువారం అనుమనాస్పదంగా మృతి చెందగా విషయం తెలుసుకున్న ప్రకాశం జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షులు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి.మరియు గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి.కంభం ప్రభుత్వ వైద్యశాలలోని పోస్టుమార్టం గదిలోఉన్నా గాలి బ్రహ్మయ్య మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా వైసీపీ అధ్యక్షుడు శివప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ. గాలి బ్రహ్మయ్య కుటుంబానికి సానుభూతి తెలియజేసి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
వారి వెంట పలువురు కంభం బేస్తవారిపేట అర్ధవీడు వైసిపి నాయకులు. ప్రజా ప్రతినిధులు. వైసిపి కార్యకర్తలు. ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

