యూరియా పంపిణీ, రైతుల సందేహాల నివృత్తి కోసం కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు - జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి.



యూరియా పంపిణీ, రైతుల సందేహాల నివృత్తి కోసం కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు - జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి.

జిల్లాలో ప్రస్తుతం అందుబాటులో 2867 మెట్రిక్ టన్నుల యూరియా.



             ఏలూరు,సెప్టెంబర్ 05: జిల్లాలో యూరియా పంపిణీ, రైతుల సందేహాల నివృత్తి కోసం ఏలూరు వ్యవసాయ శాఖ కార్యాలయంలో  కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి  తెలిపారు.  రైతులు యూరియా పంపిణీకి సంబంధించిన సమాచారంతో పాటు వ్యవసాయ సంబంధిత తమ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి 85004 21967 
 89850 21117   ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చునని కలెక్టర్ చెప్పారు.  జిల్లాలో ప్రస్తుతం 1647 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. శుక్రవారం జిల్లాకు 3 రాక్ పాయిoట్ల ద్వారా 1220 మెట్రిక్ టన్నుల యూరియా చేరిందన్నారు. మొత్తం మీద జిల్లాలో ప్రస్తుతం 2867 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు.  ఏలూరు జిల్లాలో ఎరువులకు రైతులకు సరఫరాకు ఎటువంటి సమస్య లేదని,  రైతులకు సంబందించి ఎటువంటి  సమస్యలనైనా  త్వరితగతిన పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని కలెక్టర్ తెలిపారు.








Post a Comment

Previous Post Next Post