ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేసేది కమ్యూనిస్టులే.
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ లో ఘనంగా కామ్రేడ్ సురవరం సంస్మరణ సభ.
ముగిసిన సీపీఐ రాష్ట్ర 4వ మహాసభల ఆహ్వాన సంఘ ముగింపు సమావేశం.
కూనంనేని సాంబశివరావు, శాసనసభ్యులుసీపీఐ రాష్ట్ర కార్యదర్శి.
ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేసేది కమ్యూనిస్టులేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆదివారం కుత్బుల్లాపూర్ లోని పొట్లూరి నాగేశ్వరరావు భవన్ లో సీపీఐ మేడ్చల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ పార్లమెంటు సభ్యులు సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభ సీపీఐ జాతీయ సమితి సభ్యులు యూసుఫ్ అద్యక్షతన జరిగింది.అనంతరం మహాసభల విజయవంతం కోసం కృషిచేసిన కార్యకర్తలను, వాలంటీర్స్ ను సాంబశివరావు శాలువాకప్పి సన్మానించారు.
ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ నిత్యం ప్రజా జీవితంలో ఉండే కమ్యూనిస్టులకు ఎలాంటి మచ్చ ఉండని నిస్వార్థ పరులని, సురవరం, సీతారాం ఏచూరి, గద్దర్ లాంటి వారు మరణించినప్పుడు ప్రజలు నీరాజనాలు పలికారని అన్నారు.
త్యాగాలకు, పోరాటాలకు నిలయం కమ్యూనిస్టు పార్టీ అని, అందుకే వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నా నేటికీ ప్రజల గుండెల్లో నిలిచి ఉందన్నారు. ఎన్నికలు ధన ప్రవాహంగా మారిపోయినా, మతోన్మాద శక్తులు ప్రజలను విభజిస్తున్నా వాటికి ఎదురొడ్డి సీపీఐ నిలబడిందన్నారు. నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగం నుండి సెక్యులర్, సోషలిజం పదాలను తొలగిస్తూ ఈసీ, సీబీఐ లాంటి సంస్థలను తమ గుప్పెట్లో పెట్టుకుని ప్రశ్నించే వారిని అణిచివేసే చర్యలు చేపడుతున్నదని అన్నారు. అలాంటి వారికి ఎర్రజెండా అంటే భయమని, దేశంలో కమ్యూనిజాన్ని లేకుండా చేయాలనుకుంటున్నారని అన్నారు. దేశంలో కమ్యూనిష్టులందరూ ఏకం కావాలని, ఎర్రజెండాలన్నీ ఒకే జెండాగా మారాలని అందరూ కోరుకుంటున్నారని అన్నారు. ఎర్రజెండాను మరింత ఎరుపెక్కించడమే సురవరం కు నిజమైన నివాళి అని అన్నారు. కమ్యూనిస్టులు బడుగు, బలహీన వర్గాల కోసమే పోరాడుతారని, పేద ప్రజల పట్ల కమ్యూనిస్టులకు ఎంతో అంకితభావం ఉంటుందని అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం, హక్కుల సాధనలో కమ్యూనిస్టులు ముందుంటారని అన్నారు. మనువాద భావజాలాన్ని ప్రజలపై రుద్దుతున్న బీజేపీని తరిమికొట్టేందుకు అందరం కలిసి కట్టుగా పనిచేయాలని కోరారు. ఈ సందర్భంగా సీ పీ ఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు విఎస్. బోస్,జాతీయ సమితి సభ్యులు యూసఫ్ మాట్లాడుతూ సురవరం సుధాకర్ రెడ్డి లేని లోటు వామపక్షాలతో పాటు ప్రజలకు తీరని లోటు అన్నారు. బీజేపీ కార్పరేట్ వర్గాల కోసమే పనిచేస్తున్న దని అన్నారు. దేశంలో భవిష్యత్తు కమ్యూనిస్టులదేనని చెప్పారు. సురవరం సుధాకర్‌రెడ్డి ఆదర్శవంతమైన కమ్యూనిస్టు నేత అని, దేశ రాజకీయాలోనే కాకుండ విద్యార్థి, యువజన నాయకుడుగా అంతర్జాతీయ రాజకీయాల్లో సైతం ప్రత్యేక్షంగా పాల్గొన్నడమేకాకుండా క్రీయాశీలక పాత్ర పోషించారన్నారు. ఆయన ఎంత సౌమ్యుడో రాజకీయ, సైద్ధాంతిక అంశాల్లో అంత నిక్కచ్చి అని,అన్ని అంశాల్లో అసలు రాజీ పడే ప్రసక్తే ఉండేది కాదని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దామోదర్ రెడ్డి,సాయిలు గౌడ్,ధర్మేంద్ర ఏసురత్నం,స్వామి,జిల్లా కార్యవర్గ సభ్యులు శంకర్,రచ్చ కిషన్,కృష్ణ, హరినాథ్,సత్యప్రసాద్,నర్సింహా,జిల్లా మండల కార్యదర్శులు యాదగిరి,యాదయ్య గౌడ్, బాబు,శ్రీనివాస్,మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు హైమావతి, జిల్లా నాయకులు దశరథ్.రవిచందర్,మాధవి,ప్రమీల,మహాలక్ష్మి,పర్వీనా,హసీనా,లక్ష్మి,అజీజ్జంగయ్య,చంద్రయ్య,సహాదేవ్ రెడ్డి వెంకటేష్,సంతోష్,శ్రీనివాస్.చారి,నర్సింహా రెడ్డి,కనకయ్యమల్లేష్,నర్సింహా,డేనియల్ తదితరులు పాల్గొన్నారు.

