భూమి కోసం,భుక్తి కోసం,వెట్టి చాకిరి విముక్తి కోసం,ఆత్మ గౌరవం కోసం,సమానత్వం కోసం పోరాడిన వీరనారి.
(క్రైమ్ 9మీడియా ఏ పీ & టీ జి)
చిట్యాల చాకలి ఐలమ్మ గారి 130 వ జయంతి సందర్భంగా,బీసీ సాధికారిత సంఘం ఘన నివాళులు...
పొలాస నరేందర్ జిల్లా అధ్యక్షులు, బీసీ సాధికారిత సంఘం.
ఉమ్మడి కరీంనగర్-ఉత్తర తెలంగాణ.
తెలంగాణ వీరనారి,వీర వనిత చిట్యాల చాకలి ఐలమ్మ గారి,నేడు 130 వ జయంతి సందర్భంగా,వేములవాడ తెలంగాణ చౌక్ లోనీ చాకలి ఐలమ్మ విగ్రహానికి బీసీ సాధికారిత సంఘం ఆధ్వర్యంలో పలువురు బీసీ నేతలు పూలమాలలు వేసి,ఘనంగా నివాళులు అర్పించారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ సాధికారిత సంఘం అధ్యక్షులు పొలాస నరేందర్ మాట్లాడుతూ,వరంగల్ జిల్లా,రాయపర్తి మండలం , కిష్టాపూర్ గ్రామంలో, పేద కుటుంబంలో చాకలి ఐలమ్మ జన్మించారని, పేద కుటుంబంలో జన్మించిన చాకలి ఐలమ్మ కష్టాల్లో పెరిగిందని,చాకలి ఐలమ్మకు ఆరుగురు సంతానమని,కుటుంబం మొత్తం రోజు వారి కూలీ పనులు,ఇతరుల పొలాల్లో కూలీ చేయడం,బట్టలు ఉతకడం తో జీవనాదారాన్ని కొనసాగించారని నరేందర్ అన్నారు.
చిన్నతనంలోనే తన కండ్ల ముందు అణచివేత,దోపిడీలను,పెదరికుల కష్టాలను,కఠోరమైన జీవనాన్ని,చూసి సిన చాకలి ఐలమ్మ చలించి,చిన్న వయసులోనే అన్యాయాలకు వ్యతిరేకంగా,నిలబడే ధైర్య,సహాసాలను పొంది,ఒక పోరాట వనితగా తయారయ్యేనని,సామాజిక న్యాయం,భుహక్కుల,సమాన హక్కుల,వెట్టి చాకిరి విముక్తి ,బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి ,మహిళా చైతన్యం, అణగారిన వర్గాల కోసం ఎంతగానో శ్రమించి,ఎన్నో పోరాటాలను చేసిన వీర వనిత ఐలమ్మ గారని నరేందర్ అన్నారు.
ఏడవ నిజాం పాలనలో తెలంగాణ రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను,బహుజనులు ఎదుర్కొంటున్న వివక్షను,మహిళలు ఎదుర్కొంటున్న అన్యాయాలను,బానిసత్వాలను ప్రతిఘటించి,ఈ పోరాటంలో ముందు నడిచి విజయం సాధించిన వీర వనిత ఐలమ్మ గారని నరేందర్ అన్నారు.
నిజాం నవాబు పాలనలో తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయాలను ప్రతిఘటించడంతో,ఐలమ్మ కుటుంబం ఎంతో నష్ట పోయిందనీ,ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారని,భర్త , కుమారులు చివరికి జైలు పాలయ్యారని,అన్యాయాలను వ్యతిరేకిస్తూ,ఐలమ్మ చేసిన త్యాగాలు,పోరాటాలు మరువలేనివనీ,ఐలమ్మ జీవిత చరిత్ర,ధైరం,పట్టుదల, సమూహాబలం,మహిళా చైతన్యం,సామాజిక న్యాయంకై ఐలమ్మ చేసిన పోరాటాలు,త్యాగాలు,విలువలను,తెలంగాణ సమాజం ఎన్నటికీ,ఏతరం వారు కూడ మరవ వద్దని నరేందర్ అన్నారు.
వీరనారి చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమంలో బీసీ సాధికారిత సంఘం నేతలు యేస తిరుపతి,మల్యాల దేవయ్య,కనపర్తి సుధాకర్,పోతారం రాజబోసు, సి హెచ్.రామస్వామి గౌడ్,సంకుర్తి భూమయ్య,దురిషెట్టి నాగరాజు,కనపర్తి శ్రీనివాస్,డాక్టర్ అంజయ్య,మూలికాల భాస్కర్,సంకూర్తి రాజయ్య, మ్యాన రాజేష్, ఎట్టెం సాయి కృష్ణ,ఎద్దండి రాము తదితరులు పాల్గొన్నారు.
