ఆదివాసీ నాయకుల పై లాంబాడా నాయకులు విమర్శలు చేస్తే ఊరుకునెది లేదు.


 


ఆదివాసీ నాయకుల పై లాంబాడా నాయకులు విమర్శలు చేస్తే ఊరుకునెది లేదు.

ఆదివాసులను లంబడాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తే పరిస్థితులు వేరే విధంగ ఉంటాయి.

ఎస్టీ జాబితా నుంచి లాంబాడాలను తొలగించల్సిందే లేకుంటేఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం.

ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ప్రకటనా.

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రేమల గార్డెన్ లో జరిగిన ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందేబ్బ రాష్ట్ర కమిటి ముఖ్య సమావేశములో జిల్లా కమిటి మండలలా కమిటి వారు పాల్గొని ఎస్టీ జాబితా నుంచీ లాంబాడాలను తొలగించేదాకా ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని తెలిపారు.

ఆదివాసులకు న్యాయం చేస్తుంది ఆని సుప్రీం కోర్టు మిద గంపేశడు ఆశలతో ఉన్నామని విచారణను మరింత వేగవంతం చేసి తీర్పు ను ఇవ్వాలని అన్నారు.

1976 లో అప్పటి ప్రభుత్వం తాత్కాలికంగా విద్యాపరంగా అప్పటి రాజకీయ నాయకులు తమ స్వ ప్రయోజనాల కోసం వెనుకబడిన వారు అనే నెపం తీసుకొచ్చి కేవలం తాత్కాలికంగా విద్యాపరంగా DNT లుగా అవకాశం ఇస్తే అదే అధును చూసి ఎస్టీ లుగా చెలామణి అవుతూ తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణా రాష్ట్రంలో అడివాసులకు అందాల్సిన అభివృద్ధి ఫలాలు రిజర్వేషన్ లు అన్నిటినీ లంబాడావారె అనుభవిస్తూ అదివాసులకు ఛాల అన్యాయం చేస్తున్నారని అన్నారు.కావునా ఈ రోజున కోమ్రం భీం ఆసిఫాబాద్ లో రాష్ట్ర కమిటి ముఖ్య సమావేశం నిర్వహించి భవిష్యత్తూ ఉద్యమ కార్యాచరణ ప్రణాళికను రూపొందించామని.ఆదివాసీ నాయకుల పై లాంబాడా నాయకులు విమర్శలు చేస్తే ఊరుకునెది లేదని ఆదివాసులను లంబడాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తే పరిస్థితులు వేరే విధంగ ఉంటాయని హెచ్చరించారు.

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వము కూడా వెంటనే సుప్రింకోర్టు కీ లాంబాడాలు ఎస్టీ లు కాదాని వారు DNT లుగా వచ్చారని నితి నిజాయితీగా ఉన్న నివేదికను పంపాలని , లంబాడాలాను ఎస్టీ జాబితా నుంచీ తొలగించకుంటే రానున్న రోజులలో అదివాసుల ప్రతాపం ఏంటో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తామని. ఆదివాసి చట్టాలను విఘాతం కలిగించే పనులు చేస్తే ఊరుకునేది లేదూ ఆని రాజ్యంగా పరమైన చట్టాలను ఆదివాసి చట్టాలను గౌరవించాలని... ఆదివాసి హక్కుల కోసం పోరాటం ఇక నుంచి నిరంతరంగా చేస్తామని రాష్ట్ర, జిల్లాల మండాలల కమిటి లతో ముఖ్య సమావేశం నిర్వహించి భవిష్యత్తూ ఉద్యమ కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేశామని తెలిపారు.

   

ఈ క్రింది విధంగా లంబాడా లాను ఎస్టీ జాబితాలో నుంచి తిసేయాలని కార్యాచరణ.

   ఉద్యమ కార్యాచరణ

    1) 6 అక్టోబర్ భద్దద్రి కొత్తగూడ లో పాదయాత్ర ప్రారంభం.

   2) 15 అక్టోబర్ అన్ని మండలాలోని తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాలు. 

     3) 20 అక్టోబర్ జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద వినతి పత్రాలు.

    4) అక్టోబరు 30 న ఐటీడీఏ కార్యాలయాల వద్ద వినతి పత్రలు..

   5) నవంబర్ 9 న ఉమ్మడి వరంగల్ లో భారీ బహిరంగ సభ 

    6) డిసెంబర్ 9 న కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ పైనా తెలిపిన విధంగా ఉద్యమ కార్యాచరణ ఉంటుందని రాష్ట్ర కమిటి తెలిపారు...అనంతరం తుడుందేబ్బ రాష్ట్ర కార్యదర్శిగా పూర్క బాపురావు, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ధారబోయిన రమేశ్ గార్లను నియమించటం జరిగింది.మరియు పెందోర్ పుష్పరణిని ఆదివాసి మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించటం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందేబ్బ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు(జాతీయ అధ్యక్షులు) బుర్శ పోచయ్య . , రాష్ట్ర అధ్యక్షులు కోట్నాక విజయ్ కుమార్ , ప్రధాన కార్యదర్శి ప్రధాన కార్యదర్శి సిద్ధిబోయిన లక్ష్మినారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ లు గోడం గణేష్, గుర్రాల రవీందర్, ఈశం నర్సింగ్ రావు,రాష్ట్ర ఉపాధ్యక్షులు మెస్రం మొతిరాం, పెందోర్ ప్రభాకర్, సోయం రాజేందర్, అధికార ప్రతినిధి పొడెం బాబు, మరియు రాయి సెంటర్ అదిలాబాద్ సర్ మెడి మెస్రం దుర్గు , సీనియర్ నాయకులు ఆత్రం ఆనంద్ రవ్, మరియు తుడుందేబ్బ రాష్ట్ర నాయకులు విద్యార్థీ సంఘము రాష్ట్ర నాయకులు, తుడుందేబ్బ జిల్లాల అద్యక్ష ప్రధాన కార్యదర్శులు మండలలా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post