ఏలూరు జిల్లా...
వట్లూరు (పెదపాడు ) పోషణ్ అభియాన్ లో భాగంగా ప సెప్టెంబర్ నెలను పోషకాహార నెలగా పాటిస్తున్నందున, ఈ సందర్భంలో పోషకాహార ప్రదర్శన ఏర్పాటు పీ.ఎం. శ్రీ డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ గురుకులం వట్లూరు లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ అమృత (DM&HO ) విచ్చేశారు.ముందుగా డాక్టర్.బి.ఆర్. అంబేడ్కర్ గారి చిత్ర పటానికి పూలమాలతో అలంకరించి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా డాక్టర్ అమృత DM & HO అన్ని ప్రదర్శనలను పరిశీలించి, విద్యార్థులు చేసిన కృషిని అభినందించారు. అలాగే పోషకాహార లోపం, జంక్ ఫుడ్ వలన కలిగే హానులు, అధిక ఉప్పు వాడకాన్ని తగ్గించుకోవాలి, సత్ఫలితాల కోసం సంతులిత ఆహారం తీసుకోవాలి అనే విషయాలను వివరించారు.
డాక్టర్ అమృత పిల్లల సృజనాత్మకతను ప్రశంసిస్తూ, ప్రదర్శనలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని అన్నారు. కొంతమంది విద్యార్థులు క్యారెట్, బీట్‌రూట్, స్ట్రాబెర్రీల నమూనాలను తయారు చేసి “నేనెవరో చెప్పండి” అనే రూపంలో చూపించారు. మరికొందరు పోషకాహారం పై నృత్యాలు ప్రదర్శించారు. ఇంకొందరు ధాన్యాలతో అందమైన రంగోలి వేశారు, ఇది కార్యక్రమానికి ప్రత్యేక అందాన్ని తీసుకువచ్చింది. ఈ సందర్భంగా పి.ఎం.శ్రీ డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ గురుకులం ప్రధాన ఆచార్యులురాలు దాసరి మేరీ ఝాన్సీ రాణి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పోషకాహార లోపం ఎదుర్కోవడానికి మరియు సమగ్ర శ్రేయస్సును ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని అన్నారు. విద్యార్థులు కు పోషకాహారం చాల ముఖ్యమని, అన్నారు. విటమిన్స్ శరీరానికి అవసరం పళ్ళు మరియు చిరు ధాన్యాలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మరియు
విద్యార్థులు పాల్గొన్నారు.



