బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవు. అర్బన్ సీఐ సురేష్.
( ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు )
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం పరిసర ప్రాంతాలలోని బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవని అర్బన్ సీఐ సురేష్ మందు బాబులకు హెచ్చరికా. గురువారం మండలంలోని నిర్మానుస్య ప్రదేశాలను జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు పోలీసు సిబ్బంది పరిశీలించారు. మందుబాబులు నిత్యం మద్యం సేవించేందుకు అడ్డాలుగా ఏర్పరచుకున్న కొన్ని ప్రాంతాలను పోలీసులు గుర్తించారు.
వెంటనే మున్సిపాలిటీ కార్మికులతో కలిసి ఆ ప్రదేశాలలో పగలగొట్టి పడవేసిన గాజు సీసాల ముక్కలను పోలీసులు శుభ్రం చేయించారు.
నిత్యం మద్యం తాగుతున్న ప్రదేశాలతో పాటు నిర్మానుస్య ప్రదేశాలపై నిఘా ఉంటుందని బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే మందుబాబులపై కఠిన చర్యలు తీసుకుంటామని అర్బన్ సీఐ సురేష్ తీవ్రంగా హెచ్చరించారు.
