రంగాపురం మరియు వెలగలపాయ గ్రామాలలో పిలుస్తుంది కార్యక్రమం.
(.ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.)
ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలంలోని రంగాపురం మరియు వెలగలపాయ గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ మండల వ్యవసాయ అధికారి జి శివగంగ ప్రసాద్ మాట్లాడుతూ NPCI account చేయించుకోవాల్సిన రైతుల వివరాలను తెలియ చేయడం జరిగింది. రైతులందరూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పక చేయించుకోవాలని తెలియజేశారు. అదేవిధంగా ఈనెల చివరిలోగా రైతులందరూ చేసినటువంటి పంటలకు ఈ క్రాఫ్ బుకింగ్ చేయించుకోవాలని తెలియజేశారు. నానో యూరియా మరియు నానో డి ఏ పి వలన కలిగే ఉపయోగాలు రైతులకు వివరించడం జరిగింది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించే విధంగా రైతులు వ్యవసాయంలో మార్పులు తేవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగిరెడ్డి మరియు వీఐలు వెంకటేశ్వర్లు మరియు బాలీశ్వరయ్య గ్రామ రైతులు పాల్గొన్నారు

