ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్ కోర్టు మానిటరింగ్ సభ్యులతో సమీక్ష సమావేశం.



 

ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్  కోర్టు మానిటరింగ్ సభ్యులతో సమీక్ష సమావేశం.

(క్రైం 9మీడియా ప్రతినిధి)

జిల్లా ఎస్పీ  కె ప్రతాప్ శివ కిషోర్ .. ఏలూరు, జంగారెడ్డి గూడెం, నూజివీడు, పోలవరం సబ్ డివిజన్‌ లకు చెందిన కోర్టు మానిటరింగ్ సభ్యులతో మాట్లాడుతూ కేసుల విచారణ వేగంగా జరగాలంటే సాక్షులను సమయానికి హాజరు చేయడం అనివార్యమని తెలిపారు.

ముద్దాయిలకు శిక్షలు పడేలా సమర్థంగా పని చేయాలని సూచించారు.

నేరస్తులు శిక్ష తప్పించుకోకూడదని, బాధితులు న్యాయం పొందేలా ఉండాలన్నారు.

కోర్ట్ మానిటరింగ్ సెల్ సభ్యులకు జిల్లా ఎస్పీ గారు దశ దిశను నిర్ధారించి తగిన సూచనలు సలహాలు మరియు ఆదేశాలు ఇచ్చినారు 

ప్రతి రోజు కోర్టులో జరిగిన ప్రక్రియ ను డాక్యుమెంట్ చేసి స్టేషన్ అధికారి స్థాయికి నివేదించాలని సూచించారు.

కోర్ట్ మానిటరింగ్ సెల్ సభ్యుల వారి యొక్క విధి నిర్వహణ పై ప్రతి ఒక్కరిని వ్యక్తి గతంగా వారు నిర్వర్తించే విధులు గురించి, కేసులు విచారణ చేసి సమయములో సాక్షులను సకాలంలో కోర్టు వారి ఎదుట హాజరు పరచాలి అని, ప్రతి కోర్ట్ లో న్యాయ విచారణ లో ఉన్న కేసుల యొక్క వివరాలు గురించి అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమము లో ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్  ఎన్ సూర్య చంద్రరావు, కోర్టు మానిటరింగ్ సెల్ ఇన్స్పెక్టర్ ఎం సుబ్బారావు, డి.సి.ఆర్.బి సిబ్బంది మరియు కోర్ట్ మానిటరింగ్ సెల్ సభ్యులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post