స్కూల్ కాంప్లెక్స్ ను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు:ప్రొఫెసర్ బైసాని. రామకృష్ణ.
(ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు )
ప్రకాశం జిల్లా కంభం మండలంలోని జంగoగుంట్ల కాంప్లెక్స్ సమావేశాలను సీర్ట్ ప్రొఫెసర్ బైసాని.రామకృష్ణ శనివారం సందర్శించి,
నిర్వహణపై సంతృప్తిని వ్యక్తం చేశారు. సమయ పాలన పాటించడమే కాక 100% హాజరు ఉండటం హర్షణీయమని అన్నారు. ఈ విద్యా సంవత్సరం నుండి టీచర్ హ్యాండ్ బుక్ ను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని, అందులో అకాడమిక్ క్యాలెండరు ప్రకారం ప్రతి అంశం క్షుణ్ణంగా ఇవ్వబడినదని, తద్వారా విద్యార్థులలో దాగి ఉన్న సామార్థ్యలను వెలికి తీయవచ్చని తెలిపారు . సీర్ట్ ద్వారా నిద్యార్థుల అభివృద్ధికి ఎన్నో నూతన కార్యక్రమాలనుతీసుకురావడం జరుగుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలలో SAMP -1 ఫలితాల ఆధారంగా మొదటి స్థాయిలో ఉన్న పాఠశాలలకు కాంప్లెక్స్ చైర్మన్ గని. వెంకటేశ్వర్లు బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమానికి పరిశీలకులు గా వచ్చిన మండల విద్యాశాఖధికారి టి.శ్రీనివాసులు కాంప్లెక్స్ నిర్వహణపై సంతృప్తిని వ్యక్తం చేశారు.
