ప్రభుత్వ ఉద్యోగి అంటూ దొంగతనాలకు పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్.


ప్రభుత్వ ఉద్యోగి అంటూ దొంగతనాలకు పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్.

 

(ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.)

 ప్రకాశం జిల్లా గిద్దలూరు పోలీసులు శనివారం ఒక ఘరానా దొంగను అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగిగా నమ్మించి, పావని జూలరి షాపులో కొంత బంగారాన్ని దొంగిలించాడు. గుమాస్తాను కత్తితో బెదిరించి, బంగారాన్ని తీసుకొని పరారయ్యాడు. నెల్లూరు, కడప, ప్రకాశం జిల్లాలలో కూడా ఇతను దొంగతనాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. నిందితుడి వద్ద నుంచి 66 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామని దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని కోర్టులో హాజరు పరుస్తామని విలేకరుల సమావేశంలో గిద్దలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ తెలియజేశారు.
 

Post a Comment

Previous Post Next Post