రద్దుచేసిన ఎఫ్ సీ ఆర్ ఎ ను వెంటనే పునరుద్ధరించాలి.


రద్దుచేసిన ఎఫ్ సీ ఆర్ ఎ ను వెంటనే పునరుద్ధరించాలి.


ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కన్వీనర్ రాజు మాదిగ డిమాండ్. 


( ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు )

 ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం లోని పాపినేని పల్లె ఇందిరానగర్ కాలనీలో చెంచు గిరిజనులతో సమావేశం జరిగింది 

ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కన్వీనర్ బొడిచర్ల రాజు మాదిగ మాట్లాడుతూ 

మానవ సేవే మాధవసేవా అని అంటారు. అంతకంటే మించి పేద వర్గాలకు సేవలు అందిస్తున్న ఫెరల్ స్థాపించిన ఆర్డిటి సంస్థ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ ఆంధ్ర ప్రదేశ్.తెలంగాణ ప్రాంతాలలో తమ సేవలు విస్తరించి ప్రభుత్వము చేయలేని సేవలను దళిత గిరిజనులకు అందిస్తున్నది. 

ప్రస్తుతం నిధులు రాకపోవడంతో కష్టాలతో నెట్టుకు రావలసిన పరిస్థితి వస్తుంది. అందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కారణం అని చెప్పవచ్చు విదేశాల నుండి ఆర్డిటి సంస్థకు నిధులు సేకరిస్తూ తమ సేవలను గత 50 సంవత్సరాలు పైబడి సేవలు అందిస్తుంది. నిధులు రాకుండా ఎఫ్ సి ఆర్ ఏ ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడమే కారణం.

 ఆర్డిటి సంస్థకు కూటమి ప్రభుత్వం స్పందించి కేంద్ర ప్రభుత్వంతో ఎఫ్ సి ఆర్ ఏ ను రెన్యువల్ వెనువెంటనే పునరుద్ధరించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు బొడిచర్ల రాజు మాదిగ డిమాండ్ చేశారు.  

  ఆర్ డి టి సంస్థ ద్వారా అనంతపురం జిల్లా మరియు ఆంధ్ర తెలంగాణలోని మరికొన్ని జిల్లాల ప్రాంతాలలోని కింది కులాల ప్రజలు అనాధలు,పేదలు అందులో వికలాంగులు మరెందరో జీవితాలలో వెలుగులు నింపిన ఆర్ డి టి సంస్థ దాదాపుగా ప్రభుత్వ సేవలకు సమాంతరంగా సేవలందిస్తూ వేల లక్షల మందికి ఉపాధి శిక్షణ విద్యా ఉపాధిని కల్పించి వైద్యము ఆహార మౌలిక సదుపాయాలు ద్వారా అనేకమంది పేదల జీవితాలకు భరోసాగా కుల మతాలకతీతంగా ఆర్డిటిసంస్థ సుమారు 50 సంవత్సరాలనుండి పేదల పాలిట కల్పవృక్షమైనది. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం అమ్మ పెట్టదు పెట్టే వారిని పెట్టనీయదు అనే కోణంలో కుట్రపూరితమైన మతతత్వ విద్వేషంతోనే సంస్థ యొక్క ఎఫ్ఆర్సీఏను రద్దు చేసింది. 

ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి లక్షల మంది ఆపన్న హస్తమైన ఆర్డిటి సంస్థ దేశ మరియు విదేశీ నిధులు పొందేందుకు ఎఫ్ సి ఆర్ ఏను ని పునరుద్ధరించాలన్నారు .తద్వారా లబ్ది పొందిన అర్ధవీడు మండలం ఇందిరానగర్ చెంచు గిరిజన వాసులను కలిసి రద్దుచేసిన ఎఫ్ సి ఆర్ ఏ ను తిరిగి పునరుద్ధరించాలని, జిల్లాలోని చెంచు గిరిజన ప్రాంతాలు ఆర్డిటి పునరుద్ధరణకు కూటమి ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం స్పందించేలా గిరిజన పోరు యాత్రకు సిద్ధం కావాలని ఎమ్మార్పీఎస్ నేతలు నెదరపల్లి జయరాజు, గోన మోహన్ రావు, పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గిరిజన ప్రాంతవాసులు గోన కుమార్, నాగరాజు ఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
 

Post a Comment

Previous Post Next Post