ఆరోగ్యకరమైన మాతృత్వం ద్వారానే ఆరోగ్యకరమైన కుటుంబం.



 

ఆరోగ్యకరమైన మాతృత్వం ద్వారానే ఆరోగ్యకరమైన కుటుంబం.


స్వస్థ్ నారీ - సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల.


ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

 ప్రకాశం జిల్లా కంభం వైద్య శాల లో జరిగిన కార్యక్రమంలో శాసనసభ్యులు మాట్లాడుతూ ఆరోగ్యకరమైన మాతృత్వం ద్వారానే ఆరోగ్యకరమైన కుటుంబం సాధ్యమని గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి పేర్కొన్నారు.

మహిళలు నాణ్యమైన ఆహారం తీసుకొని ఆరోగ్యవంతంగా ఉండాలనే లక్ష్యంతో సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు మధ్యప్రదేశ్ రాష్ట్రం వేదికగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని, ఈరోజు కంభం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. 

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన శాసనసభ్యులు అశోక్ రెడ్డి మొదటగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

వైద్యశాల ప్రాంగణంలో ఐసిడిఎస్ మరియు వైద్యశాల వైద్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్రీయ పోషణ మాసం స్టాల్స్ ను పరిశీలించారు.. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సమాజ ఆరోగ్య సాధనలో భాగంగా మహిళలు, కుటుంబాల సంక్షేమం కోసం తీసుకువస్తున్న ఈ ప్రత్యేక కార్యక్రమం అందరికీ మేలు చేకూర్చుతుంది అని మహిళా సంక్షేమం ద్వారానే కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటాయని తద్వారా సమాజ శ్రేయస్సు సాధ్యమన్నారు.ఈ కార్యక్రమంలో కంభం పట్టణ కూటమి నాయకులు, వైద్యశాల సిబ్బంది, స్థానిక ఎంపీడీవో ఐసిడిఎస్ సిబ్బంది ప్రజలు తదితరులు పాల్గోన్నారు.

Post a Comment

Previous Post Next Post