ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.



ప్రకాశం జిల్లా ఎస్పీ  వి.హర్షవర్ధన్ రాజు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.  


మద్యం సేవించి ప్రజలను ఇబ్బందులు పెడుతున్న వారిలో సత్ప్రవర్తన తీసుకువచ్చేందుకు జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.  


(ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు)

ప్రకాశం జిల్లా క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండాలి... జిల్లా ప్రజలకు కూడా క్లిన్ అండ్ గ్రీన్ ఉండటమే లక్ష్య సాధన అనే నినాదంతో ముందుకు వెళ్ళుతున్న జిల్లా పోలీసులు

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మద్యం సేవిస్తున్న మందుబాబులు జరభద్రం.

మద్యం సేవించి రోడ్డెక్కార వారి కోసం బహిరంగ ప్రదేశాల సిద్ధంగా ఉన్నాయి.

బహిరంగ ప్రదేశాలు సిద్దంగా ఉన్నాయంటి అనుకుంటున్నారా.

మందుబాబులలో మార్పు తీసుకురావడం తోపాటు వారు సేవిస్తున్న పరిసరాలలో కూడా మార్పు తీసుకు వస్తున్నారు జిల్లా పోలీసులు.

మద్యం సేవిస్తున్నవారితో... మత్తు దిగే వరకు పరిసరాలను శుభ్రం చేయించి. అక్కడ ఉన్న చెత్త, చేదారాన్ని ఊడ్పించి వారితో నిప్పు పెట్టిస్తున్నారు.వారిలో ఉన్న చేడు అలవాట్లు కూడా ఈ నిప్పులలోనే కాలిపోవాలంటూ.. పోలీసు సిబ్బంది మందుబాబులకు కౌన్సింగ్ ఇస్తున్నారు.

చేడు వ్యసనాలకు బానిసలు అవడం ద్వారా.మీ కుటుంబాలు రోడ్డున పడటంతో పాటు వారి బిడ్డల బంగారు భవిష్యత్ అంధకారం అవుతుందని పోలీసు అధికారులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు.

అంతేకాకుండా వారి బిడ్డలు భవిష్యత్ మీద ఎన్నోకలలు కంటారని.. వారి ప్రవర్తన వల్లన కన్నకలలు కలలుగానే మిగిలి పోవటం క్షమించరాని నేరమన్నారు.

ఇప్పటికైన మద్యం సేవించే ముందు..మందుబాబులు ఒక్కక్షణం అలోచించాలని పోలీసు సిబ్బంది మందుబాబులకు సూచిస్తున్నారు.

మద్యం సేవించే ఒక్కరిలో మార్పు వస్తే.మీ కుటుంబ అంతా బంగారుమయం అవుతుందన్నారు.

మందు బాబులు మద్యం సేవించి హల్ చల్ చేస్తే.మొదటి తప్పు గా భావించి బహిరంగ ప్రదేశాల్లో శుభ్రం చేయిస్తున్నామన్నారు.

ఇప్పుటికే జిల్లా వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాలను గుర్తించి.డ్రోన్ కెమెరాలతో అసాంఘిక కార్యక్రమాలు పాల్పడే వారిపై నిఘా పెట్టామన్నారు.

మద్యం సేవించి ప్రజలను ఇబ్బందులు పెట్టిన, మహిళలను అల్లరి చేసిన అలాంటి వారి చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మద్యం సేవించిన. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించమన్నారు..
 

Post a Comment

Previous Post Next Post