(ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు )
ప్రకాశం జిల్లా గిద్దలూరు లో బిసి సంక్షేమ సంఘం నియామక సమావేశం బిజెపి నాయకులు జేవీ నారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీసీలందరూ ఐక్యమత్తంగా కలిసికట్టుగా మన హక్కులను సాధించుకోవాలని రాష్ట్ర అధ్యక్షులు శంకర రావు అన్నారు. బీసీలకు సబ్ ప్లాన్ , మంత్రిత్వ శాఖ, చట్టసభల్లో రిజర్వేషన్ కల్పిస్తామని దేశ ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారని తర్వాత కూడా ఇంతవరకు ఎటువంటి బీసీలకు న్యాయం జరగలేదని శంకరరావు అన్నారు. బ్రిటిష్ కాలంలో మాత్రమే కుల గణాలు లెక్కించడం తప్ప ఇంతవరకు మళ్లీ జరగలేదన్నారు. అత్యధికంగా ఓబీసీల సంఖ్య ఉన్న చట్టసభల్లో బీసీ మంత్రిత్వ శాఖ గాని మహిళ రిజర్వేషన్ కానీ ఏర్పాటు చేయలేకపోతున్నారని రాష్ట్ర అధ్యక్షులు శంకరరావు ప్రశ్నించారు.
దేశంలో 18 రాజకీయ పార్టీలు కుల గణాంకాలు లెక్కించాలని దీనికి 22 రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయని అన్నారు. మరి ఇండియా కూటమి బీసీలకు 42 శాతం గా చట్టసభల్లో ప్రవేశపెడతామన ఇండియా కూటమి అవసరమైతే 46% చటసభల్లో ఓబీసీలకు అవకాశం కల్పించేందుకు ఇండియా కూటమి సిద్ధంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు 33% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తానని హామీ ఇచ్చి విధివిధానాలను కేంద్ర ప్రభుత్వానికి పంపించడం కాదు.ఎన్డీఏ కూటమిలో కీలక పాత్రగా ఉన్న చంద్రబాబు ఆమోదించేల వ్యవహరించాలని అన్నారు. ఇప్పటికైనా దేశ ప్రధాని నరేంద్ర మోడీ మేలుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని పలువురు బీసీలు నాయకులు ప్రజలు పాల్గొన్నారు.
