కంభం చెరువును సందర్శించిన ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని.
( ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు )
ప్రకాశం జిల్లా కంభం మండలంలోని కంభం చెరువును ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ సందర్శించారు. చెరువుల సందర్శించి చెరువు ప్రకృతి అందాలను అభివర్ణించారు. చెరువును చూస్తే తనకు ఎంతో ఆనందంగా ఉందని కంభం చెరువును మంచి పర్యాటక ప్రదేశంగా రూ.35 కోట్ల వరకు ఖర్చు చేసి తీర్చిదిద్దుతామని అన్నారు. అవసరమైతే ఇంకా అదనంగా ఖర్చు చేస్తామని బాలాజీ తెలిపారు. చెరువులో బోటింగ్, చెరువు ప్రాంతంలో ఓ రిసార్ట్ ఏర్పాటు చేస్తామన్నారు. మన రాష్ట్రంలో ఎంత అందమైన సుందరమైన చెరువు ఉండడం తనకెంతో ఆనందంగా ఉందని సీఎం చంద్రబాబు, స్థానిక ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తో కలిసి ఈ ప్రాంతాన్ని పర్యటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ అన్నారు. ఈ కార్యక్రమంలో నీటి పారుదల శాఖ అధికారులు వివిధ శాఖ అధికారులు కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
