విద్యుత్ షాక్ తో రైతు మృతి .
(ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు )
ప్రకాశం జిల్లా. అర్ధవీడు మండలం . మండలంలోని అయ్యవారిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోనున్న చింత మల్లెలపాడు గ్రామ నికి చెందిన రైతు ఏశపోగు చిన్న కాశయ్య(45) శుక్రవారం పరివర్తకం వద్దకు గేదెలు వెళ్లడంతో వాటిని తోలే క్రమంలో తీగలు తగిలి విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే కుప్పకూలాడు. తోటి రైతులు వెళ్లి పరిశీలించగా..అప్పటికే మృతి చెందినట్టు తెలిపారు. అర్ధవీడు సబ్ ఇన్స్పెక్టర్ శివ నాంచారయ్య సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి. కేసు నమోదు చేసి.
శవ పంచనామకు మృతదేహాన్ని కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
