మార్కాపురం మెడికల్ కాలేజీ వద్ద వైసిపి శ్రేణుల ఆధ్వర్యంలో నిరసన.


 మార్కాపురం మెడికల్ కాలేజీ వద్ద వైసిపి శ్రేణుల ఆధ్వర్యంలో నిరసన. 


(ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు )

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం సమీపంలోని మెడికల్ కాలేజీ వద్ద వైఎస్ఆర్సిపి నేతలు కార్యకర్తలు నిరసనకు దిగారు. శుక్రవారం ఉదయం నుంచి భారీగా మెడికల్ కాలేజీ వద్దకు చేరుకున్న వైసీపీ శ్రేణులు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడం వల్ల పేదలు మెరుగైన వైద్య సేవలు కోల్పోతారని వైసిపి నాయకులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు. దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. బూచేపల్లి వెంకాయమ్మ.

మార్కాపురం వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ అన్న రాంబాబు. గిద్దలూరు వైసిపి ఇన్చార్జి కే నాగార్జున రెడ్డి. వైయస్సార్ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post