గిద్దలూరు సబ్ జైలును ఆకస్మిక తనిఖీ చేసిన న్యాయమూర్తి.


 

గిద్దలూరు సబ్ జైలును ఆకస్మిక తనిఖీ చేసిన న్యాయమూర్తి. 


(ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు )

ప్రకాశం జిల్లా గిద్దలూరు సబ్ జైలును జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ.భారతి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఖైదీలకు అందుతున్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి నేరాలు చేసి జైలుకు వచ్చారో ఖైదీలతో మాట్లాడి న్యాయమూర్తి భారతి అడిగి తెలుసుకున్నారు. ప్రవర్తన మార్చుకొని మంచిగా బతకాలని ఖైదీలకు తెలిపారు. ఏదైనా న్యాయ సేవలు కావాలంటే న్యాయ సేవాధికార సంస్థ ద్వారా పేదలకు న్యాయ సేవలు ఉచితంగా అందిస్తామని న్యాయమూర్తి భారతి తెలిపారు.

Post a Comment

Previous Post Next Post