మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే ముత్తుముల.


 మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే ముత్తుముల.

 ( ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు )

ఇంజనీరింగ్ పితామహుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్బంగా కొమరోలు మండల సర్వసభ్య సమావేశంలో గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతిని "జాతీయ ఇంజనీర్స్ డే గా జరుపుకుంటున్న సందర్భంగా నవభారత నిర్మాణం కోసం కృషి చేస్తోన్న ఇంజనీరింగ్ నిపుణులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మరించుకుంటూ నివాళులు అర్పించారు. 

తెలుగుదేశం ప్రభుత్వానికి పేరు తెచ్చిన ఎన్నో నిర్మాణాలకు తమ ప్రతిభను అందించిన ఇంజనీరింగ్ నిపుణుల ఋణం తీర్చలేనిదని, అమరావతి నిర్మాణంలో కష్టపడుతున్న ఇంజనీర్లకు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ, రాజధాని నిర్మాణం రాష్ట్ర గౌరవం, అభివృద్ధికి ప్రతీక అని కొనియాడారు. 

 ఈ కార్యక్రమంలో కొమరోలు ఎంపీపీ కామూరి అమూల్య, ఎంపీడీఓ చెన్నారావు, తహసీల్దార్ భాగ్యలక్ష్మి, మండల పార్టీ అధ్యక్షులు బోనేని వెంకటేశ్వర్లు, సొసైటీ బ్యాంక్ చైర్మన్ ముత్తుముల సంజీవ రెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాసరెడ్డి, మరియు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గోన్నారు..

Post a Comment

Previous Post Next Post