ఎర్రకోట సాక్షిగా మాట తప్పిన ప్రధాని నరేంద్ర మోడీ.


 

ఎర్రకోట సాక్షిగా మాట తప్పిన ప్రధాని నరేంద్ర మోడీ.


 రైతు సంఘం జిల్లా కార్యదర్శి వీరారెడ్డి.


 ప్రకాశం జిల్లా బేస్తవారిపేట లో రైతు సంఘం జిల్లా కార్యదర్శి. కె వీరారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ 

 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో రైతులఆత్మహత్యలు పెరిగిపోయాయని. ఆయన తెలియజేశారు.ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గిద్దలూరు నియోజకవర్గ సమావేశం అధ్యక్షుడు జే. అంకయ్య అధ్యక్షతన బేస్తవారిపేటలో సోమవారం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా వీరారెడ్డి పాల్గొని ప్రసంగించారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 ఎన్నికల ముందు ప్రధాని నరేంద్ర మోడీ డాక్టర్ స్వామినాథన్ సిఫార్సులను అమలు చేస్తామని హామీ ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు అయినా నేటికీ స్వామినాథన్ సిఫార్సులను అమలు చేయలేదని విమర్శించారు. ఎర్రకోట, పార్లమెంటు సాక్షిగా మన దేశ రైతులకు అండగా ఉంటామని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారని, కానీ ఇటీవల కాలంలో డోనాల్డ్ ట్రంప్ మన దేశం నుండి అమెరికాకు దిగుమతి అయ్యే ఉత్పత్తుల మీద 50 శాతం సుంకం విధిస్తే మన ప్రధానమంత్రి దానిపై నోరు మెదపడు. ఇదేనా అండగా ఉండడం అంటే అని ఆయన ప్రశ్నించారు. 

మనదేశంలో రొయ్యలు సాగు చేసే రైతాంగం అమెరికా నుంచి యూరప్ కు ప్రధానంగా అమెరికాకే 40 శాతం రొయ్యల దిగుమతి జరుగుతుందని వారి మీద 50 శాతం టారీఫ్ విధించడం ద్వారా రొయ్యల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ నేపథ్యంలో రైతు సంఘాలు అనేక ఆందోళనలు చేపట్టిన ఫలితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపై చర్యలు తీసుకోవాలని నరేంద్ర మోడీకి లెటర్ రాసినా ప్రధానమంత్రికి చీమకుట్టినట్లైనా లేదని విమర్శించారు 

గిద్దలూరు నియోజకవర్గ రైతు సంఘం కార్యదర్శి ఢాకాల పుల్లయ్య, సీపీఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి ఊరుమార్పు జోషేప్, రైతులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post