సన్నజాజి తోటలు పరిశీలన.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి (యోబు )ప్రకాశం జిల్లా కంభం మండలంలో రావిపాడు గ్రామము లోని మల్లె మరియు సన్నజాజి తోటలని ఉద్యాన శాఖ అధికారి డి శ్వేత పరిశీలించారు. మల్లె తోటలో మిడ్జ్ ఈగ ఉదృతి ఎక్కువగా ఉండడం గమనించడం జరిగింది. ఈ ఈగ లార్వ మొగ్గలోకి చేరడం వల్ల మొగ్గ గులాబీ రంగులోకి మారి ఎండిపోవడం జరుగుతుంది. దీని నివారణకు థియోమితాక్సం 0.75ml లీ. నీటికి లేదా నోవలురాన్ 3ml లీ. నీటికి కలిపి పది రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి అన్నారు. జాజి తోటలో నల్లి ప్రభావం ఎక్కువగా ఉంది. నల్లి ఆకు అడుగు భాగాన చేరి రసం పీల్చడం వల్ల ఆకు పై బొబ్బలు ఏర్పడి ఎండిపోవడం జరుగుతుంది అన్నారు. దీని నివారణకు స్పైరోమెసిఫెన్ 1 గ్రా. లీ. నీటికి లేదా డిఫెంథియరాన్ 1 గ్రా. లీ. నీటికి లేదా ఫెనజాక్విన్ 1ml. లీ. కలిపి పిచికారి చేయాలి అన్నారు. ఒకసారి చల్లిన మందు మళ్లీ మళ్లీ పిచికారి చేయాలుందా మార్చి మార్చి పిచికారి చేయాలి అన్నారు. ఆమెతో వి ఎ ఎ మల్లికార్జున్ మరియు రైతులు పాల్గొన్నారు.
