దొంగ ఓట్లకు బుద్ధి చెప్పుదాం, రాహుల్ గాంధీ గారికి అండగా ఉందాం.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి (యోబు )వినుకొండ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు వినుకొండ నియోజకవర్గ ఇన్చార్జి బోయపాటి రామాంజనేయులు అధ్యక్షత జరిగిన సమావేశంలో పాల్గొన్న *పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గర్నెపూడి అలెగ్జాండర్ * మరియు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు. అలెగ్జాండర్ మాట్లాడుతూ దేశంలో ఈ బీజేపీ ప్రభుత్వ అండదండతో దేశ ఎన్నికల సంఘం అనేక చోట్ల దొంగ ఓట్లను చేరుస్తుంది అని, కేంద్ర ఎన్నికల సంఘం చేసిన మోసాలను సఖ్యలతో సహా మా నాయకులు రాహుల్ గాంధీ బయటపెట్టారని, ఇప్పటికైనా ఎన్నికల సంఘం మొద్దు నిద్ర లేచి చేసిన తప్పు ఒప్పుకొని జరిగిన తప్పును సరిజేయాలని కోరారు. మోడీ సర్కారు నాయకుల మెప్పుకోసం రాజ్యాగాన్ని ఉల్లంఘించి ఈ అధికారులు తప్పు చేశారో వారిని రాబోయేరోజుల్లో బోనులో నిలబడి ఉంటారని వ్యాఖ్యానించారు. అలానే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శ్రీమతి వైఎస్ షర్మిల రెడ్డి. ఆద్వర్యంలో మరింత బలోపేతం అవుతుందని, పార్టీ బలోపితానికి స్థానిక ఇన్చార్జి బోయపాటి రామాంజనేయులు గారితో కలసి పనిచేసి ఈ వినుకొండ నియోజకవర్గంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు పల్నాడు జిల్లా కాంగ్రెస్ అధికారి ప్రతినిధి రెడ్డి బోయిన ప్రసన్న కుమార్ ,సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, NSUI & యువజన కాంగ్రెస్ నేత పఠాన్ కరీముల్లాఖాన్.పల్నాడు జిల్లా అసంఘటిత కార్మిక విభాగం అధ్యక్షులు పిడుగు విజయ్.వినుకొండ రూరల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు అడపాల శ్రీనివాసరావు వినుకొండ ఎస్సీ సెల్ అధ్యక్షులు కందుల దేవ ఎస్సీ సెల్ నాయకులు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
.jpeg)