అనారోగ్యంతో 10వ తరగతి గురుకుల పాఠశాల విద్యార్థిని మృతి.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలానికి చెందిన 10వ తరగతి విద్యార్థి కర్ణ అనారోగ్యంతో మృతి చెందింది. రాచర్ల మండలంలోని గురుకుల పాఠశాల నుంచి ఆగస్టు 14న తీవ్ర జ్వరంతో కర్ణ వెలగలపాయలోని తన నివాసానికి వచ్చింది. అప్పటినుంచి విద్యార్థికి తన అమ్మమ్మ ఆసుపత్రులలో చికిత్స అందిస్తుండగా కర్ణ ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుంది. ఉన్నట్టుండి శనివారం విద్యార్థి పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కర్ణ మృతి చెందింది. గురుకుల పాఠశాలలో సరైన వసతులు, లేకపోవడం వల్లే విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్నారని ప్రజాసంఘాల నాయకులు ప్రజలు ఆరోపిస్తున్నారు.
Tags
latest news
