టిడిపి కార్యకర్త కుటుంబానికి 5 లక్షల బీమా చెక్కును అందజేసిన ప్రభుత్వం చీఫ్ విప్ జీవి గారు..
ప్రమాదంలో మరణించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త కటికల విజయ్ కుమార్ కుటుంబానికి రూ. 5 లక్షల బీమా చెక్కును ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారు శనివారం అందజేశారు. నూజెండ్ల మండలం ఐనవోలు గ్రామానికి చెందిన కటికల విజయ్ కుమార్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. నేపథ్యంలో రాష్ట్ర పార్టీ కార్యాలయం నుండి వచ్చిన చెక్కు ను బాదిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా జీవి గారు మాట్లాడుతూ కార్యకర్తలకు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ బాబు అండగా నిలుస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Tags
latest news
