కోట సత్యమాంబ దేవాలయానికి రథం బహుకరణ.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి ప్రకాశం జిల్లా బెస్తర పేట మండలం గొట్టమిళ్ళ గ్రామంలో వెలిసిన శ్రీ సత్యమాంబ దేవి ఆలయానికి అర్ధవీడు మండలం కాకర్ల గ్రామానికి చెందిన శ్రీ పెద్ద రంగయ్య ధర్మపత్ని రంగలక్ష్మీ గారి కుమారుడు కాసుల రంగస్వామి( మధుప్రియ ఫ్యామిలీ రెస్టారెంట్ ) కుటుంబ సభ్యులు. శ్రీ కోట సత్యమాంబ దేవి ఆలయానికి విలువైన రథాన్ని బహుకరించారు.
ముందుగా మధుప్రియ రెస్టారెంట్ నుండి కందులపురం సెంటర్.కాలేజీ రోడ్డు మీదుగా పురవీధుల నుండి శ్రీ సత్యమాంబ దేవాలయం వరకు మేళతాళాల డప్పులతో ఊరేగింపు జరిగింది.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ఆరేపల్లి మల్లికార్జున్. కాసుల పాండు. మెడికల్ అసోసియేషన్ నాయకుడు ప్రసాదు. బంధుమిత్రులు. వివిధ గ్రామాలనుండి వచ్చిన ప్రజలు. శ్రీ సత్యమాంబ దేవి భక్తుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలు చేశారు.
Tags
latest news

