గోవా మద్యం అమ్మకాలపై దాడులు నిర్వహించిన కంభం ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్.





 గోవా మద్యం అమ్మకాలపై దాడులు నిర్వహించిన కంభం ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్.

 35  గోవా మద్యం ఫుల్ బాటిళ్లు సీజ్..  ఒక వ్యక్తి అరెస్టు. 

కంభం:  క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.,
ప్రకాశం జిల్లా కంభం మండలం కంభం గ్రామంలో నెహ్రు నగర్ ఎందు  గోవా మద్యం అమ్మకాలపై కంభం ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్,  సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పోతురాజుటూరు గ్రామానికి చెందిన కవలకుంట్ల నరేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 35 గోవా ఫుల్ (750ml) మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ కొండారెడ్డి మాట్లాడుతూ ఎవరైనా ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం సీసాలు అమ్మిన,బెల్ట్ షాపులు నిర్వహించినా, అక్రమంగా మద్యం తరలించినా, అక్రమంగా మద్యం కలిగి ఉన్నా, అమ్మినా  ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ వారికి వెంటనే  సమాచారం అందించాలని కోరారు.   సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆయన అన్నారు.

Post a Comment

Previous Post Next Post