ఆముదం పంట సాగు విధానంలో శిక్షణ.
(ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు)
ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలంలోని బొల్లుపల్లి గ్రామంలో ఆముదం పంట వేసిన రైతులకు శిక్షణ కార్యక్రమం బుధవారమునిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జి శివగంగ ప్రసాద్ మాట్లాడుతూ రైతులు ఆముదం పంట విత్తినప్పుడు నుంచి పంట కోసే సమయం వరకు రైతులు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి క్షుణ్ణంగా వివరించడం జరిగింది. ఆముదం పంట కాలము పరిమితి 100 రోజులు నుండి 120 రోజులు కాబట్టి రైతులు ఆముదం పంటను మే నెల మొదటివారం లొ విత్తుకొని వర్షాలు ప్రారంభమయ్యే ముందు కల్లా దిగుబడి తీసుకోవచ్చని తెలియజేశారు. అనగా జూలై నెల చివరికల్లా పంట కోత వచ్చే విధంగా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు. పూత సమయంలో ఎండ వాతావరణము ఎక్కువ ఉన్నచో మగ పుష్పములు ఎక్కువగా వచ్చి ఆడ పుష్పములు తక్కువ వచ్చేదానికి అవకాశం ఉంది. దీనివలన పంట దిగుబడి తగ్గేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు పూత సమయంలో పంటను బేట్టకు రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు. అదేవిధంగా ఆముదము పంటను పరిశీలించి పంటను ఆశించినటువంటి సెమీ లూపర్(నామాల పురుగు) పురుగును నివారించడానికి ఫ్రొఫినోపాస్ 1 ml లీటర్ నీటి కలుపుకొని పిచికారి చేయాలి రైతులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వి ఏ ఏ శ్రీమంతు మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు.

