పోలవరం ప్రాజెక్టు ఆర్అండ్ఆర్ పనుల భూ సేకరణ పనులు వెంటనే పూర్తి చేయాలి.
ఆయా గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించాలి-జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి.
ఏలూరు, ఆగష్టు, 19 : పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల కోసం అమలు చేస్తున్న ఆర్ అండ్ ఆర్ పనులకు సంబంధించి భూ సేకరణ ను వేగవంతం చేయాలనీ జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్ నుండి పోలవరం ప్రాజెక్టు ఆర్అండ్ఆర్ భూ సేకరణ, జాతీయ రహదారుల భూసేకరణ, తదితర అంశాలపై అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి తమ భూములు అందించిన నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి లో భాగంగా భూమికి భూమి, ఆర్ అండ్ ఆర్ కాలనీల నిర్మాణం, తదితర పనులకు గాను ఏలూరు జిల్లాలో మిగిలిఉన్న భూసేకరణ పనులను వెంటనే పూర్తిచేయాలని, తాడిపూడి ఎత్తిపోతల పధకం భూసేకరణ కూడా పూర్తిచేయాలన్నారు. బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి మండలాలలో భూసేకరణ కు అవసరమైన భూమిని వెంటనే గుర్తించాలన్నారు. భూసేకరణ కోసం భూమిని గుర్తించిన తర్వాత ఆయా గ్రామాలలో రైతులతో ఆర్డీవో, డిఎస్పి అధికారులు చర్చించి వారి సమక్షంలో గ్రామ సభలు నిర్వహించాలని సూచించారు. భూములకు పరిహారాన్ని ప్రభుత్వ నిబంధనలు ప్రకారం రైతులకు చెల్లించటానికి అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. భూ సేకరణ స్నేహపూరిత వాతావరణంలో రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేలా అధికార యంత్రాంగం వ్యవహరించాలని జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి సూచించారు.
జిల్లా జాయింటు కలెక్టరు పి.ధాత్రిరెడ్డి, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న,ఆర్డీవో యం.అచ్యుత అంబరీష్, అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఐటిడిఏ అపూర్వ భరత్, జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వర రావు, స్పెషల్ కలెక్టరు యస్.సరళ వందనం,స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు,తహాశీల్దార్లు, డిప్యూటీ తహాశీల్దార్లు,తదితరులు పాల్గొన్నారు.
