తెలుగుతేజం అవార్డుకు సాహితీవేత్త నాసరయ్య ఎంపిక.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి:- ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలానికి చెందిన ప్రముఖ కవి, విద్యావేత్త, సాహితీవేత్త, రచయిత గొట్టిముక్కుల నాసరయ్య శ్రీశ్రీ కళావేదిక అందించే అత్యంత ప్రతిష్టాత్మకమైన తెలుగు తేజo అవార్డు అందుకోనున్నారు, ఈ మేరకు శనివారం శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ కత్తిమండ ప్రతాప్ నుండి ఆహ్వానం అందుకున్నారు, ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డును పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఆగస్టు 31న నిర్వహించే తెలుగు భాష సంబరాల కార్యక్రమంలో ప్రముఖుల చేతుల మీదుగా స్వీకరించనున్నారు, గొట్టిముక్కుల నాసరయ్య తెలుగు భాష, సాహిత్య, సంస్కృతి - సాంప్రదాయాల సంస్కృతుల పరిరక్షణ, ప్రాచుర్య విస్తరణలో అపారమైన కృషి చేస్తున్నారు, సృజనాత్మక ప్రతిభకు ఈ అవార్డు ఒక గుర్తింపుగా నిలుస్తుందన్నారు. ఆయన రచనలు పాఠకులను ఆలోచింపజేసి భవిష్యత్తులో తెలుగు సాహిత్య కృషికి ప్రేరణనిస్తాయి, తెలుగుతేజం అవార్డు భాషా పరిరక్షణ, సాహిత్య గౌరవాన్ని ప్రపంచ వేదికపై నిలుపుతూ, తెలుగు సాహిత్య సేవలను అభినందించే అత్యున్నత ప్రతిష్టాత్మక పురస్కారం అందుకుంటున్న నాసరయ్యని పలువురు అభినందించారు.
Tags
latest news
