ప్రకాశం జిల్లా కంభం మండలంలోచిరుత పులిసంచారాన్ని నిర్ధారించిన అధికారులు - భయభ్రాంతులకు గురవుతున్న రైతులు.




ఎల్ కోట పరిసర పంట  పొలాలలో చిరుత పులి పాదముద్రలు భయభ్రాంతులకు గురవుతున్న రైతులు.

 (ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు):-ప్రకాశం జిల్లా కంభం మండలంలోని నడింపల్లి, ఎల్ కోట మధ్యలో ఉన్న పంట పొలాల్లో మంగళవారం చిరుత పులి పాదముద్రలు కనిపించడంతో సానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఔరంగాబాద్ స్థానిక గ్రామానికి చెందిన రైతులు  ఏనుగు కొండ సమీపంలో సాగు చేస్తున్న మొక్కజొన్న పంట వద్దకు వెళ్లిన సమయంలో వారికి పులి పాదముద్రలను కనిపించడంతో ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ సిబ్బంది నడింపల్లి గ్రామానికి చేరుకొని వివరాలు సేకరించారు. పరిసరాలను పరిశీలించిన ఫారెస్ట్ సిబ్బంది ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాగ్రత్తగా ఉండాలని రైతులకు గ్రామ ప్రజలకు సూచించారు. 

పులి సంచారాన్ని నిర్ధారించిన అధికారులు దాని కదలికలను గుర్తించేందుకు ట్రాఫ్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు.

Post a Comment

Previous Post Next Post