Sri.A.R. Damodhar, IPS.,
Superintendent of Police
మూడు సంవత్సరాల బాలికను హింసించిన కేసులో శిక్ష .
మూడు సంవత్సరాల పాపని హింసించిన కేసులోని A1 నిందితునికి 2 సంవత్సరాల జైలు మరియు రూ.10,000/- రూపాయలు జరిమానా విధించిన గౌరవ ఒంగోలు Spl JFCM Excise కోర్ట్ వారు *
నిందితులకు శిక్ష పడటంలో సమర్ధవంతంగా విధులు నిర్వహించిన పోలీస్ అధికారులను మరియు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏఆర్ దామోదర్
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలోని మాచవరం గ్రామానికి చెందిన భూపతి సుధీర్ ఆంజనేయులు 32 సంవత్సరాలు అను అతను అదే గ్రామానికి చెందిన చంద్రావతి అను ఆమెతో సన్నిహిత సంబంధం పెట్టుకొని ఆమె కూతురు జయాస్ ఏంజెల్ మూడు సంవత్సరాలు అను అమ్మాయి అడ్డుగా ఉందని నిరంతరం కొట్టుతూ చిత్రహింసలకి గురి చేయడంతో శిశు సంరక్షణ శాఖ అధికారి పురుషోత్తమ రావు ఫిర్యాదు మేరకు సదురు విషయం గురించి నాగులుప్పల పాడు పోలీస్ స్టేషన్ నందు Cr.No. 73/2021 U/S 324,r/w 34 IPC,Sec 75JJ Act ప్రకారం అప్పటి స్టేషన్ SHO K. పాండురంగరావు (HC 158) కేసు నమోదు చేయగా అప్పటి నాగులుప్పల పాడు సబ్ ఇన్స్పెక్టర్ ఏ. శశికుమార్ అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేపట్టి నిందితుడి ఫై ఛార్జ్ షీట్ చేసికోర్టులో దాఖలు చేసారు.
అనంతరం అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి. శ్రావన్ కుమార్ ప్రాసిక్యూషన్ తరుపున వాదించారు. పోలీస్ సిబ్బంది సాక్షులను కోర్ట్ లో సమయానుసారం హాజరు పరుస్తూ ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ మార్గదర్శకత్వంలో సమర్థవంతంగా విచారణ నడిపి సరైన సాక్ష్యాధారాలతో నిందితుడుపై నేరనిరూపణ చేసినందున తేది 25.08.2025 న గౌరవ స్పెషల్ జుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు ఒంగోలు వారైనా శ్రీమతి కోమలి వల్లీ గారు A1 నిందితునికి 2 సంవత్సరాల జైలు మరియు రూ10,000/- రూపాయలు, చొప్పున జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు.
సదరు కేసులో సరైన సాక్ష్యాధారాలు కోర్ట్ లో ప్రవేశపెట్టి సమర్థవంతంగా ట్రయల్ మానిటరింగ్ చేసి నిందితులకు శిక్షించబడటంలో క్రియాశీలక పాత్ర పోషించిన ప్రస్తుత నాగులుప్పల పాడు సబ్ ఇన్స్పెక్టర్ షేక్ రజియా సుల్తానా బేగం, మరియు నాగులుప్పలపాడు. కోర్టు కానిస్టేబుల్ డి ఎల్ . నారాయణ(PC- 3650), ఎస్.హరికృష్ణ (PC-2499) లను ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్.ప్రత్యేకంగా అభినందించారు.