రూ: 3 కోట్లతో జీలుగుమిల్లిలో BT రోడ్డుకు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ శంకుస్థాపన.












రూ: 3 కోట్లతో జీలుగుమిల్లిలో BT రోడ్డుకు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ శంకుస్థాపన.
‎ఏలూరు, ఆగస్టు 15 : జీలుగుమిల్లిలో రూ: 3 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన BT రోడ్డుకు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో దారుణంగా తయారైన రహదారులను ఒక్కటొక్కటిగా నిర్మించుకుంటూ వస్తున్నామని ఎంపీ పుట్టా మహేష్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 

పోలవరం, చింతలపూడి నియోజకవర్గాల్లో ఈరోజు సుడిగాలి పర్యటన చేసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చివరిగా జీలుగుమిల్లిలో BT రోడ్డుకు శంకుస్థాపన చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు.


ఈ కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు మండల టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Post a Comment

Previous Post Next Post