చిరుత దాడిలో గాయపడిన చిన్నారికి మానవతా దృక్పధంతో సహాయం చేసిన ప్రకాశం పోలీసులు.


ప్రకాశం జిల్లా  ...

చిరుత దాడిలో గాయపడిన చిన్నారికి మానవతా దృక్పధంతో సహాయం చేసిన ప్రకాశం పోలీసులు.


క్రైమ్ 9 మీడియా ప్రతినిధి (యోబు )దోర్నాల మండలం చిన్నారుట్ల గిరిజన గూడెంలో తేదీ 13/08/2025 రోజున రాత్రి ఇంటి బయట నిద్రిస్తున్న కుడుముల అంజమ్మ (తండ్రి అంజయ్య) అనే మూడు సంవత్సరాల పాపపై చిరుతపులి దాడి చేసింది. పాపను నోటితో పట్టుకొని తీసుకుపోతుండగా, తండ్రి అంజయ్య చూసి గట్టిగా అరవడంతో చిరుతపులి పాపను వదిలి సమీపంలోని చెట్ల పొదల్లోకి వెళ్ళింది. ఈ ఘటనకు స్పందించిన గ్రామ పెద్ద మంతన్న , వెంటనే డిఎఫ్ఓ ,తో మాట్లాడి, బాలికకు తక్షణ వైద్యం సహాయం అందించేందుకు సుండిపెంట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.

తదుపరి, సంఘటన వివరాలు తెలుసుకున్న దోర్నాల ఎస్‌.ఐ వి. మహేష్ మరియు వారి సిబ్బంది బాధిత చిన్నారిని మెరుగైన వైద్యం కోసం దోర్నాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యం కోసం స్వయంగా సహాయం చేయడంతో పాటు, చిన్నారికి ఆర్థిక సాయం అందించి, వారికి పండ్లను ఇచ్చి పరామర్శించడం జరిగింది. చిరుతపులి దాడిలో గాయపడిన చిన్నారి పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. గ్రామస్థులు, పోలీసులు, వైద్య సిబ్బంది అందరూ కలిసి చిన్నారి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిచారు. 

Post a Comment

Previous Post Next Post