ఎమ్మెల్యే ముత్తుములను ఘనంగా సన్మానించిన కంభం సొసైటీ బ్యాంకు నూతన కమిటీ సభ్యులు.
ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపిన కంభం సొసైటీ బ్యాంకు చైర్మన్, మరియు మెంబర్లు.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి (యోబు ) గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి ని కంభం సొసైటీ బ్యాంకు నూతన కమిటీ సభ్యులు బుధవారం నాడు మర్యాదపూర్వకంగా కలిసి పూలమాల శాలువా వేసి ఘనంగా సన్మానించారు. కంభం సొసైటీ బ్యాంకు చైర్మన్ గా కేతం శ్రీను, మెంబర్లుగా కర్ణం బాలకోటయ్య, సందు వరలక్ష్మి గార్లు నియమించబడ్డారు. తమ పై నమ్మకంతో తమను గుర్తించి బాధ్యతలను అప్పచెప్పిన ఎమ్మెల్యే కు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కంభం సొసైటీ బ్యాంకు చైర్మన్ కు, మెంబర్లకు శుభాకాంక్షలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో కంభం మండల పార్టీ అధ్యక్షులు తోట శ్రీను మరియు మండల నాయకులు తదితరులు పాల్గోన్నారు..